Balakrishna: బాలయ్యకు మాత్రం ఇలా.. చిరంజీవికి మాత్రం అలా.. టాలీవుడ్ లో ఎందుకు ఈ భిన్నత్వం..?

కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవ సందర్భంగా వివిధ రంగాలలో విశేష సేవలు అందించిన వారికి పద్మ అవార్డుల ప్రధానోత్సవం చేస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ 2025 ఏడాదికి గానూ 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పలువురికి పద్మ అవార్డులు ప్రకటించారు. అందులో రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏడు మందిని ఎంపిక చేయడం జరిగింది. ఇక సినీ పరిశ్రమ నుండి నందమూరి బాలకృష్ణ , కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో పాటు సీనియర్ హీరోయిన్ శోభనకి కూడా పద్మభూషణ్ అవార్డు లభించింది.

అటు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించడంతో చిరంజీవిని మొదలుకొని వెంకటేష్, మహేష్ బాబు తో పాటు పలువురు యంగ్ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు, హీరోయిన్స్ ప్రతి ఒక్కరు కూడా బాలయ్యకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక అటు బాలకృష్ణ కూడా తనకు పద్మభూషణ్ అవార్డు రావడానికి తన సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరి హస్తం ఉందని అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాదు తనను ఎంపిక చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా.. బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో.. త్వరలో సన్మాన సభ నిర్వహించనున్నారట. అంతేకాదు ఇందుకు సంబంధించిన తేదీని, వెన్యూని కూడా వెల్లడించనున్నట్లు సమాచారం. ఇకపోతే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడంతో సన్మాన సభ ఏర్పాటు చేస్తున్నారని తెలిసి, చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకొని ఎనలేని విజయాలను అందించిన మెగాస్టార్ చిరంజీవికి 2024లో పద్మ విభూషణ్ వస్తే, 2006లోనే పద్మభూషణ్ అవార్డు ఆయనకు వరించింది. అలా పద్మ అవార్డులు వచ్చినప్పుడు.. ఎందుకు సన్మాన సభ నిర్వహించలేదు. అంటూ ఇండస్ట్రీ పెద్దలపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు అప్పట్లో చిరంజీవికి అవార్డు వచ్చినప్పుడు ట్విట్టర్ లో కూడా ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు బాలకృష్ణకు.. మాత్రమే సన్మాన సభ నిర్వహిస్తుండడంతో.. చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ వివాదం మళ్ళీ తెరపైకి వచ్చినట్లు.. నెటిజన్స్ కామెంట్లు చేస్తూ చెలరేగిపోతున్నారు.
అంతేకాదు బాలయ్యకు మాత్రం అలా.. చిరంజీవికి ఇలా.. టాలీవుడ్ సినీ ప్రముఖుల్లో.. ఎందుకు ఈ భిన్నత్వం అంటూ ప్రశ్నిస్తున్నారు.. మరి దీనిపై ఇండస్ట్రీ వర్గాలు ఏ విధంగా స్పందిస్తాయో చూడాలి.