Guru Purnima 2024: గురు పౌర్ణమి రోజు సాయిబాబాను ఎందుకు పూజిస్తారో తెలుసా..?
మనదేశంలో అనాదీగా వస్తున్న ఆచారాలు, సంప్రదాయాలలో గురువులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీరాముడు,శ్రీకృష్ణుడు వంటి అవతార పురుషులు సైతం గురువులను ఆశ్రయించి విద్యబుధ్దులు నేర్చుకున్నారు. రాముడు వశిష్టుడి దగ్గర, శ్రీకృష్ణుడు సాందీపుని దగ్గర, పాండవులు ద్రోణాచార్యుడి దగ్గర, కర్ణుడు పరుశురాముడి దగ్గర విద్యను అభ్యసించారు.
ఆషాడమాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా భావిస్తారు. ఈరోజు వ్యాసభగవానులను జన్మించారని చెబుతుంటారు. అందుకే వ్యాసపౌర్ణమి అంటారు. వ్యాసుడు, బాసలో గోదావరి నది ఒడ్డున సరస్వతి అమ్మవారిని ప్రతిష్టించారు. అప్పటి నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటారు. ఆదిశంకరాచార్యుల పరంపర, గౌతమ బుద్దుడు, సాయిబాబాలను ఎందరు గురుపరంపరగా భావిస్తుంటారు.
షిర్డీలో సాయిబాబా వందల ఏళ్ల క్రితం వెలిశారని చెబుతుంటారు. ఆయన తన యోగ మాయ చేత.. భూమిలో దీపాలను వెలిగించారు. దాన్ని గురుస్థానంగా చెప్తుంటారు. షిర్డీలో వెలసి, అక్కడి వారికి అనేక ఆపదల నుంచి కాపాడారు. ముఖ్యంగా అల్లా మాలీక్.. దైవమే సర్వాధికారి అని బోధనలు చేస్తుండేవారు. సాయిబాబా ముఖ్యంగా శ్రద్ధా, సబూరీ అనే నినాదాలు చేస్తుండేవారు.
షిర్డీలో వచ్చే భక్తులకు ఊదీని ప్రసాదంగా ఇస్తుంటారు. ఎన్నికష్టాలున్న కానీ.. బాబా పేరు తలవగానే అవన్ని దూరమౌతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. సాయిబాబా.. రాముడు, శ్రీకృష్ణుడు, శివుడి రూపంగా చాలా మంది భావిస్తారు. అందుకు చాలా మంది ఇప్పటికి కూడా సాయిబాబాను ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు.
సాయిబాబా మరణించి తర్వాత మూడు రోజుల తర్వాత మరల బతికారు. వివేకానంద, రామకృష్ణపరమహంసలను కూడా సాయిబాబాతో మాట్లాడరని చెబుతుంటారు. ఇప్పటికి కూడా సాయిబాబా షిర్డీలో కన్పిస్తుంటారని చాలా మంది భక్తులు విశ్వసిస్తుంటారు. ఆయన తన మహిమలతో భక్తులు ఇళ్లలో లేదు.. అనే శబ్దం వినపడకుండా చేస్తారని చెబుతుంటారు.
అందుకే గురుపరంపరలో భాగంగా గురుపౌర్ణమిరోజున సాయిబాబాను చాలా మంది కొలుచుకుంటారు. ఉదయాన్నే సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సాయిబాబా పారాయణం, సాయిచరిత్ర వంటి గ్రంధాలు, స్తోత్రాలు ఎక్కువగా చదువుతారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)