Balakrishna: బాలయ్య కూతురిని రిజెక్ట్ చేసిన మహేష్ బాబు.. వామ్మో.. అప్పట్లో అంత జరిగిందా..?
నందమూరీ బాలయ్య బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఈ నేపథ్యంలో నారా బ్రాహ్మాణికి గతంలో మహేష్ బాబుతో పెళ్లి చేయాలని కూడా బాలయ్య ఫ్యామిలీ అనుకున్నారంట.
సినిమా ఇండస్ట్రీలో ఘట్టమనేని ఫ్యామిలీకి మంచి పేరుఉన్న విషయం తెలిసిందే. హీరో కృష్ణ ఇంటికి తన కూతుర్ని కోడలిగా పంపాలని బాలయ్య బాబు ఎంతో ప్రయత్నాలు చేశారంట. మహేష్ బాబుకు సైతం దీని మీద పలు సందర్భాలలో ఇన్ డైరెక్ట్ గా బాలయ్య చెప్పికూడా చూశారంట
కానీ మహేష్ బాబు మాత్రం.. అప్పటికే నమ్రతతో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే బాలయ్య ప్రపోజల్ కు మాత్రం సింపుల్ గా రిజక్ట్ చేశారంట. ఈ నేపథ్యంలో మహేష్ బాబు కొన్ని రోజుల్లోనే నమ్రతను పెళ్లి చేసుకున్నారంట. దీంతో బాలయ్య ప్రపోజల్ కు మాత్రం అలా బ్రేక్ పడిపోయిందంట.
2005లో నమ్రతను మహేష్ బాబు వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాల సభ్యులు ఉన్నప్పటికీ మహేష్ పెళ్లి విషయం మీడియాకు తెలియదు. అత్యంత సన్నిహితుల మధ్య సింపుల్ గా మహేష్ బాబు పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు గౌతమ్ కాగా, అమ్మాయి పేరు సితార.
ఒక ప్రక్క సినిమాలు చేస్తునే మహేష్ బాబు సామాజిక సేవ చేస్తున్నారు. గుండె జబ్బుల బారిన పడిన చిన్నారులకు ఆపరేషన్ చేయిస్తున్నారు. రెండు గ్రామాలు దత్తత తీసుకుని మౌళిక సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం మరోసారి బాలయ్య కూతురు నారా బ్రాహ్మాణి, మహేష్ బాబుకు పెళ్లి ప్రపోజల్ జరిగాయనే వార్తలు మరోసారి వైరల్ గా మారాయి. అయితే.. దీనిలో ఎంత నిజం ఉందో మాత్రం ఇప్పటికి సస్పెన్స్ గానే ఉందని చెప్పుకొవచ్చు. కొంత మంది మాత్రం ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. అలాంటిదేమీ జరగలేదని, కేవలం రూమర్స్ అంటూ కూడా కొట్టిపారేస్తున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)