Naga Chaitanya: అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య పెళ్లి.. వెనుక పెద్ద కథే..!

Tue, 12 Nov 2024-5:24 pm,
Naga Chaitanya wedding venue

నాగ చైతన్య, శోభితా ధూళిపాళాల వివాహం ప్రస్తుతం అభిమానులలో, సినీ వర్గాలలో చర్చగా మారింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ జంట వివాహ వేడుకను అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.   

Sobhita wedding venue

ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా, నాగ చైతన్య తాత అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్)కి గల ఆత్మీయ స్మరణార్ధంగా.. ఈ చోటుని అక్కినేని ఫ్యామిలీ వారు.. అనుకోవడం వల్ల.. ఇక్కడే నాగచైతన్య పెళ్లి జరపాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Naga Chaitanya wedding date

అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. ఏఎన్‌ఆర్ భారతీయ సినిమాకి చేసిన ప్రాముఖ్యతను గుర్తుచేసుకునే.. ప్రదేశంగా ఈ స్టూడియో నిలిచింది. స్టూడియోలో ఏఎన్‌ఆర్ విగ్రహం కూడా ఉంది. ఇలా పలు కారణాల వల్ల ఇక్కడే పెళ్లి చేయాలని అక్కినేని కుటుంబం సంకల్పంతో ఉన్నారట. 

నాగ చైతన్య తన కొత్త జీవితం ప్రారంభం చేయడానికి ఈ ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకోవడం ద్వారా తాత ఆశీర్వాదం పొందుతారని అక్కినేని ఫ్యామిలీ వారి నమ్మకం.వివాహ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ సంవత్సరం చివర్లో వివాహ వేడుక జరగవచ్చని అనుకుంటున్నారు. 

అయితే, ఈ సమాచారంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది గ్రాండ్ వేడుక కంటే సన్నిహిత వాతావరణంలో కుటుంబ సభ్యులతో.. జరగవచ్చని సమాచారం. దీపావళి సందర్భంగా చైతు, శోభిత ఈ మధ్య.. అక్కినేని కుటుంబంతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ జంట ఈ సంవత్సరంలో ఆగస్టు 8న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link