Why Not Smily Photos: పాస్‌పోర్టు, ఆధార్‌ కార్డుల్లో ఫొటోలు ఎందుకు నవ్వకుండా ఉంటాయో తెలుసా? చిన్న లాజిక్‌..

Sun, 04 Aug 2024-6:04 pm,

ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డ్ ఉంటుంది. ఇక పాన్ కార్డు, పాస్‌పోర్టులు కూడా ఉంటున్నాయి. గుర్తింపు కార్డుల్లోని మన ఫొటోలు ఉంటాయి. అయితే ఆ ఫొటోలు గంభీరంగా.. సీరియస్‌గా ఉంటాయి. అలా ఎందుకు ఉంటాయో తెలుసా?

అంతర్జాతీయ ప్రయాణాలకు పాస్‌పోర్ట్ తప్పనిసరి. కానీ ఇది అనేక ఇతర ప్రదేశాలలో ప్రామాణిక గుర్తింపు కార్డుగా పని చేస్తుంది. ఆధార్ కార్డ్‌తోపాటు పాన్ భారతీయ పౌరుల ముఖ్యమైన గుర్తింపు కార్డుగా పని చేస్తున్నాయి. గుర్తింపు కార్డుల్లో ఉన్న ఈ ఫొటోలు ఆయా సందర్భాల్లో ముఖ గుర్తింపు కోసం వినియోగిస్తారు. ముఖాలు నవ్వకుండా గంభీరంగా ఉండడంతో సులువుగా వ్యక్తిని గుర్తిస్తాయి.

చిరునవ్వుతో ముఖం ఉంటే యంత్రం సరిగ్గా గుర్తించడం కష్టమవుతుంది. ముఖ కవళికలు ఎలాంటి స్పందన లేకుండా సక్రమంగా ఉంటే ఫొటోలను గుర్తించడం సులువుగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

ఫొటోలు నవ్వుకుంటూ ఉంటే మోసం, గుర్తింపును దాచే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇక పాస్‌పోర్ట్‌ల అంశానికి వస్తే చాలా దేశాలు ఫొటోగ్రాఫ్‌ల కోసం ఒకటే ప్రమాణాలు కలిగి ఉంటాయి. ఇందులో నవ్వుతూ ఉండకూడదు. ప్రయాణ సమయంలో గుర్తింపు ధృవీకరణను సులభతరం చేయడానికి ఫొటోలు నవ్వకుండా ఉండాలి. గంభీరమైన, తటస్థ ముఖంతో ఫొటో ఉంటే సాఫ్ట్‌వేర్‌ ద్వారా ముఖ గుర్తింపు సులభమవుతుంది. సులువుగా స్కాన్ చేయవచ్చు.

చిరునవ్వు ముఖ స్వరూపాన్ని మారుస్తుంది. ఇది గుర్తింపు ప్రక్రియను కష్టం చేస్తుంది. విభిన్న వ్యక్తీకరణలతో తీసిన ఫొటోలు ఒకే వ్యక్తి ఫొటోల గుర్తింపులో గందరగోళానికి దారి తీస్తుంది. గంభీరంగా ఫొటోలు ఉంటే ఎడిటింగ్‌ చేయడానికి అవకాశం ఉండదు. ఫొటోషాప్ లేదా ఇతర పద్ధతుల ద్వారా నవ్వే ఫొటోలను సులభంగా మారవచ్చు. ఇలా మోసాలను అరికట్టేందుకు గంభీరంగా ఉండే ఫొటోలు దోహదం చేస్తాయి.

పాస్‌పోర్ట్ బయోమెట్రిక్ ఫొటోలో ఎలాంటి భావ వ్యక్తీకరణ ఉండకూడదు. ప్రజలను నవ్వడానికి అనుమతిస్తే ప్రజలు ఈ చిత్రాలలో కూడా ప్రయోగాలు చేస్తూ కనిపిస్తారు. ఈ పరిస్థితిలో ఒక చిన్న ప్రయోగం చేస్తే బయోమెట్రిక్‌ యంత్రాలు గుర్తించవు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link