CBSE exams 2021: సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్‌పై అయోమయం

Tue, 10 Nov 2020-3:20 am,

CBSE Board exams 2021 schedule news | వచ్చే ఏడాది సీబీఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్ ఎప్పటి షెడ్యూల్ కంటే ముందుగానే జరగొచ్చా అంటే అవుననే తెలుస్తోంది. నీట్, జేఈఈ ( NEET, JEE ) లాంటి పోటీ పరీక్షల్ని సకాలంలో నిర్వహించుకోవడానికి వీలుగా సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్స్‌ని వీలైనంత త్వరగా నిర్వహించే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. అయితే, దీనిపై సీబీఎస్ఈ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.  ( Image courtesy : Representational image )

సీబీఎస్ఈ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయడంతో పాటు, ఎగ్జామ్ ఫామ్స్-LOC ప్రక్రియను కూడా పూర్తి చేసినట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. సీబీఎస్ఈతో పరిధిలోకి వచ్చే పాఠశాలలన్నీ బోర్డు టైమ్ టేబుల్‌ ( CBSE exams 2021 time table ) ప్రకారం వీలైనంత త్వరగా సిలబస్‌ని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ( Image courtesy : Representational image )

కరోనావైరస్ వ్యాప్తి ( Coronavirus pandemic ) కారణంగా ఈ ఏడాదిలో 6 నెలలకుపైనే పాఠశాలలు మూతపడిన నేపథ్యంలో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని తగ్గించేందుకు వీలుగా సిలబస్‌ని తగ్గించడం లేదా పరీక్షల్ని 45 రోజుల నుంచి 60 రోజులు ఆలస్యంగా నిర్వహించే అవకాశాలున్నాయనే వార్తలు కూడా వెలువడుతున్న సంగతి తెలిసిందే. ( Image courtesy : Representational image )

దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఢిల్లీ సమీప ప్రాంతాల్లోని సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపల్స్ ( CBSE schools principals ) నుంచి అభిప్రాయాలు సేకరించగా.. వచ్చే ఏడాది సీబీఎస్ఈ పరీక్షలు వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేస్తేనే బాగుంటుందని పాఠశాలల ప్రిన్సిపల్స్ తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు సమాచారం. ( Image courtesy : Representational image )

సీబీఎస్ఇ పరీక్షలు వాయిదా వేసిన పక్షంలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు వారి పై చదువులకు, పలు ప్రవేశ పరీక్షలకు భంగం కలిగే ప్రమాదం ఉందని సీబీఎస్ఈ స్కూల్స్ ప్రిన్సిపల్స్ తమ అభిప్రాయాన్ని తెలిపారు. ( Image courtesy : Representational image )

సిబిఎస్ఇ పరీక్షల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంపై సీబీఎస్ఈ 10వ తరగతి, సీబీఎస్ఈ 12వ తరగతి విద్యార్థుల్లో, వారి తల్లిదండ్రుల్లో ప్రస్తుతం అయోమయం నెలకొంది. ఇంతకీ సీబీఎస్ఈ ఏం నిర్ణయం తీసుకోనుందో వేచిచూడాల్సిందే మరి. ( Image courtesy : Representational image )

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link