Bigg Boss Re Entry: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనున్న మాజీ కంటెస్టెంట్.. రచ్చరంబోలే..!

Sat, 21 Sep 2024-12:35 pm,

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ మూడవ వారం చివరి దశకు చేరుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్  హౌస్ లోకి అడుగు పెట్టగా,  మొదటివారం బెజవాడ బేబక్క రెండవ వారం ఆర్ జే శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడవ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు ఇక ఒకరోజు మాత్రమే మిగిలి ఉంది. 14 మందిలో రేపు  ఒకరు ఎలిమినేట్ అయితే ఇక 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉంటారు వీరితో గేమ్ ఆడించడం కాస్త కష్టంగానే ఉంటుంది. 

అందుకే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మాజీ కంటెస్టెంట్స్ తో పాటు హాట్ బ్యూటీలని హౌస్ లోకి దింపే ప్రయత్నం చేస్తుంది బిగ్ బాస్. ఇక అందులో భాగంగానే ప్రముఖ బ్యూటీ గుప్పెడంత మనసు సీరియల్ జగతి క్యారెక్టర్ లో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన జ్యోతి పూర్వాజ్ హౌస్ లోకి రాబోతోంది అంటూ వార్తలు రాగా ఇప్పుడు మరో మాజీ కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి అడుగు పెట్టబోతుందని సమాచారం. 

ఆమె ఎవరో కాదు నయని పావని. బిగ్ బాస్  సీజన్ 7 లో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి మొదటి వారంలోనే  ఎలిమినేట్ అయిన నయని పావని ఇప్పుడు మళ్లీ హౌస్ లోకి రాబోతోందని సమాచారం. గతంలో నయని పావని ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ చాలామంది ఆడియన్స్ ఈమెకు మద్దతు పలికారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్లీ ఈమెను బిగ్ బాస్ సీజన్ 8 లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తీసుకురాబోతున్నట్లు సమాచారం.

నయని పావని కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇంస్టాగ్రామ్ లో దాదాపు ఒక మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమెను మళ్లీ హౌస్ లోకి తీసుకొచ్చే అవకాశం ఉండడంతో ఆమె అభిమానులు కూడా హౌస్ లోకి అడుగు పెట్టాలని కోరుతున్నారు. మరి నయని పావని అభిమానుల కోరిక మేరకు హౌస్ లోకి అడుగుపెడుతుందా లేదో చూడాలి.

ఇకపోతే ఈ వారం నామినేషన్ విషయానికి వస్తే యష్మీ గౌడ , ప్రేరణ, పృథ్వి, నైనిక , మణికంఠ , విష్ణుప్రియ , సీత, అభయ్ నామినేట్ అయ్యారు.  వీరిలో ఎవరు ఎలిమినేట్ అయి హౌస్ నుంచి వెళ్ళిపోతారో అని ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link