Gold Outlook: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. త్వరలోనే లక్ష దాటనున్న బంగారం ధర.. ఎప్పుడంటే ?
Gold- Price: బంగారం ధరలు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తున్నాయి. గత నెలలో బడ్జెట్ సందర్భంగా బంగారం ధరలు 67,000 రూపాయలు వరకు పతనం అయ్యాయి. కానీ అక్కడ నుంచి బంగారం ధరలు భారీగా పెరగడం ప్రారంభించాయి. ఆగస్టు 15 తర్వాత బంగారం ధరలు ఒకసారిగా ఊపొందుకున్నాయి దీంతో పసిడి ధరలు ప్రస్తుతం 72 వేల రూపాయలు దాటాయి. గత నెల కనిష్ట స్థాయితో పోల్చి చూసినట్లయితే బంగారం ధరలు 10 గ్రాములకు 5,000 రూపాయల చొప్పున పెరిగింది.
ఈ నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో ఎలా ఉంటాయి అనే దిగులు పసిడి ప్రియుల్లో నెలకొని ఉంది. బంగారం ధరలు భారీగా పెరగడం వెనక అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల్లో కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంగారం ధర అమెరికాలో ఒక ఔన్సు అంటే సుమారు 31 గ్రాములు 2500 డాలర్లు దాటింది. గతంలో ఇది 2000 డాలర్ల లోపు ఉండేది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు దేశీయంగా కూడా పెరుగుతూ వస్తున్నాయి.
ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ సెప్టెంబర్లో అర శాతం మేర వడ్డీ రేట్లు పెంచుతుందని వార్తలు వెలువడటంతో ఒకసారిగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తున్నారు. ఎందుకంటే అమెరికా జారీ చేసే ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు తగ్గించినట్లయితే రాబడి తగ్గిపోతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు తరలిస్తారు. దీంతో పసిడి ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ కూడా పెరగడంతో బంగారం ధరలు నూతన గరిష్ట స్థాయిని చేరుకుంటున్నాయి. దీపావళి నాటికి బంగారం ధర 80,000 రూపాయలు దాటిన ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధరలు త్వరలోనే ఒక తులం లక్ష రూపాయలు దాటే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
మరోవైపు అంతర్జాతీయంగా గమనించినట్లయితే చైనా వల్ల బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. చైనా సెంట్రల్ బ్యాంకు గడచిన సంవత్సర కాలంగా విపరీతంగా బంగారం నిల్వలను పెంచుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారం నిలువలను కొనుగోలు చేస్తూ చైనా సెంట్రల్ బ్యాంకు, తమ నిధులను పెంచుకునే పనిలో పడింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. గత సంవత్సరం నుంచి కూడా బంగారం ధర పెరగడానికి చైనా విపరీతంగా కొనుగోలు చేయడం కూడా ఒక కారణంగా చెబుతున్నారు.
ఈ సంవత్సరం రెండవ క్వార్టర్ లో చైనా కాస్త నెమ్మదించినప్పటికీ, ప్రస్తుతం అమెరికా మాంద్యం నేపథ్యంలో విపరీతంగా బంగారం కొనుగోలు చేయాలని మరోసారి చైనా సెంట్రల్ బ్యాంక్ తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. వరుసగా 18 నెలల పాటు చైనా బంగారు నిల్వలను కొనుగోలు చేసిన తర్వాత పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా నుండి వచ్చిన సమాచారం ప్రకారం 224.9 మెట్రిక్ టన్నుల బంగారం కొనుగోళ్లతో 2023లో చైనా అతి పెద్ద బంగారం దిగుమతి దారుగా ప్రపంచంలో అవతరించింది.
ఈ సంవత్సరం జూన్ నెలలో చైనా బంగారం కొనుగోలను నిలిపివేసినప్పటికీ, మళ్లీ ఈ నెల నుంచి బంగారం కొనుగోలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ కొనుగోలు కొనసాగినట్లయితే బంగారం అమెరికా మార్కెట్లో 2500 డాలర్ల నుంచి 3000 డాలర్లకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే కొనసాగితే బంగారం దేశీయ మార్కెట్లో వచ్చే ఏడాది నాటికి ఒక తులం 1 లక్ష దాటడం ఖాయంగా కనిపిస్తోంది.