Health tips: శీతాకాలంలో డయాబెటిస్ పేషెంట్స్ ఇవి తింటే రిస్కే
శీతాకాలంలో చల్లటి వాతవరణం నుంచి ఉపశమనం పొందడం కోసం కొంతమందికి పదేపదే వేడివేడి ఛాయ, కాఫీ లేదా పాలు తాగడం అలవాటు. అయితే, అలా టీ, కాఫీలు సేవించే క్రమంలో అందులో పంచదార ఏ మాత్రం ఎక్కువైనా... అది ఆరోగ్యానికే రిస్క్ అవుతుంది. శీతాకాలంలో ఆ రిస్క్ ఇంకా ఎక్కువుంటుంది కనుక పంచదార అధికంగా కలిపిన ఏ పానియాలకైనా దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
మక్కజొన్నల పిండితో చేసిన రొట్టెలు కానీ లేదా మక్క జొన్న పిండితో చేసిన ఏ పిండి వంటలకైనా డయాబెటిస్ పేషెంట్స్ దూరంగా ఉండాల్సిందే. అందుకు కారణం ఇందులో కూడా గ్లెసెమిక్ ఇండెక్స్ అధికంగా ఉండటమే.
స్వీట్స్ తయారీలో బెల్లం విరివిగా ఉపయోగిస్తుంటాం. చలికాలంలో బెల్లం తింటే కొన్నిరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చని చెబుతుంటారు. కానీ మధుమేహంతో బాధపడే వారికి అది వర్తించదు అంటున్నారు వైద్య నిపుణులు. బెల్లంలో అధికంగా ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ మధుమేహం వ్యాధిగ్రస్తుల శరీరానికి హానీ చేస్తాయనేది వారి సూచన.
చలికాలంలోనే కాకుండా ఏ కాలంలోనైనా అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషదం తేనే. మన వంట గదిలోనే ఉండే తేనేతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కానీ డయాబెటిస్ పేషెంట్స్‌కి మాత్రం తేనేతో ఇబ్బందులు తప్పవు. అందుకు కారణం అందులో సహజంగానే అధికమోతాదులో ఉండే షుగర్ లెవెల్స్. తేనేతో శరీరంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. డయాబెటిస్ పేషెంట్స్ తేనే తిన్నట్టయితే.. వారిలో షుగర్ లెవెల్స్ పెరిగి అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉంది.
ఆరోగ్యానికి పండ్లు ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో అధిక మోతాదులో ఉండే విటమిన్స్, మినెరల్స్ శరీరానికి మేలు చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పండ్లలో ఉండే షుగర్ మాత్రం డయాబెటిస్ పేషెంట్స్‌కి హానీ చేస్తుంది.
వేపుడు వంటకాలు, ఆహారపదార్థాల్లో అధికంగా ఉండే ట్రాన్స్‌ఫ్యాట్ శరీరంలో ఇన్సూలిన్ ఉత్పత్తిపై దుష్ర్పభావం చూపిస్తుంది. ఫలితంగా డయాబెటిస్‌తో వచ్చే సమస్యలు అధికమవుతాయి. వీటికి దూరంగా ఉండటం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చు.
Also read : Obesity health issues: లావుగా ఉంటే లైంగిక సమస్యలు వస్తాయా ? లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా ?
Also read : Side effects of Vitamin D Tablets: కరోనాకు చెక్ పెట్టేందుకు విటమిన్ డి పిల్స్ వాడుతున్నారా ? ఐతే రిస్కే!