Tea and Coffee: చలిగా ఉందని అదే పనిగా టీలు, కాఫీలు తాగుతున్నారా..?.. మీరు ఈ డెంజర్‌లో పడ్డట్లే..
చలికాలం ప్రారంభమైంది. దీంతో ఇప్పటి వరకు వర్షాలతో ఇబ్బందులు పడిపోయిన జనాలు కాస్త చలికి గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా చలికాలంలో వృద్దులు, చిన్న పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
చాలా మందిలో ఇమ్యునిటీ పవర్ సరిగ్గా ఉండక పోవడంవల్ల ముఖ్యంగా చలికాలంలో అనేక వ్యాధుల బారిన పడుడుతుంటారు. జలుబు, ఆయాసం, తిమ్మిర్లు, కాలేయ సంబంధ రుగ్మతలు, జీర్ణక్రియ సమస్యల్ని ఎదుర్కొంటారు.
కొంత మంది చలిగా ఉందని అదే పనిగా కాఫీలు, టీలు తాగడం చేస్తుంటారు. దీని వల్ల అనేక సమస్యలు కల్గుతాయని నిపుణులు చెబుతున్నారు. టీలు, కాఫీలు తాగడం వల్ల ఆకలి వేయడం చచ్చిపోతుంది. మనకు శరీరంలో జీవ గడియారం ఉంటుంది.
అది సమయానికి కొన్ని సంకేతాలను ఇస్తుంది. ఉదయం టిఫిన్,లంచ్, ఈవెనింగ్ ఆకలిగా అన్నించడం, రాత్రి పూట ఆకలివేయడం వంటివి జీవగడియారం మన శరీరంకు సంకేతాలు ఇస్తుంది. ఆ సమయంలో కొన్ని కెమికల్స్ మన శరీరంలో విడుదలౌతాయి.
కానీ మనం కాఫీలు, టీలు తాగుకుంటూ కూర్చుంటే.. ఆకలి చచ్చిపోతుంది. దీని వల్ల శరీరంలో విడుదలైన కెమికల్స్ వల్ల అవయవాలు ప్రభావానికి గురౌతాయి. అందుకే చాలా మంది కడుపులో ఏదో మంటగా ఉంది.. కడుపులో కాలిపోతున్నట్లు ఉందని అంటుంటారు.
కాఫీలు, టీలు తాగుతుంటే.. నిద్ర అనేది ఉండదు. వీటిలో ఉండే కొన్ని కారకాలు మన శరీరంపై ప్రభావం చూపిస్తాయి. జీర్ణక్రియపై కూడా కొన్నిసార్లు చెడు ప్రభావంను చూపిస్తుంటారు. కాఫీలు, టీల వల్ల కొందరిలో ఒత్తిడి కూడా పెరుగుతుంది. అందుకే ఏదైన అతిగా కాకుండా.. ఒక నియమిత పరిమాణంలో తీసుకుంటే మాత్రం చెడు ప్రభావాల నుంచి బైటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)