Women Health Tips: పీరియడ్స్ సమయంలో నొప్పులు తగ్గించేందుకు ఏం తినవచ్చు, ఏం తినకూడదు

Sat, 23 Dec 2023-5:22 pm,

ఆల్కహాల్

మద్యం తాగడం ఆరోగ్యానికి కచ్చితంగా హానికరమే. పీరియడ్స్ సమయంలో నొప్పులకు మాత్రం ఆల్కహాల్ ప్రతిబంధకం కాకపోవచ్చు. దీర్ఘకాలం మద్యం తాగే అలవాటున్నవారిలో మెగ్నీషియం స్థాయి తగ్గుతుంది. అందుకే ఆల్కహాల్‌కు దూరంగా ఉంటే మంచిది. 

కెఫీన్

కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పుులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కాఫీ, ఎనర్జీ డ్రింక్స్, ప్రోసెస్డ్ ఎనర్జీ బార్ వంటివి అధికంగా తీసుకోకూడదు.

ప్రోసెస్డ్ ఫుడ్

పీరియడ్స్ సమయంలో ప్రోసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీనే మహిళల్లో పీరియడ్స్ సమయంలో నొప్పులు ఎక్కువగా ఉంటాయంటారు. ఇది కొన్ని అధ్యయనాల్లో తేటతెల్లమైంది. అందుకే ప్రోసెస్డ్ ఫుడ్‌కు దూరంగా ఉంటే చాలా మంచిది. 

విటమిన్ ఇ ఆహారం

విటమిన్ ఇ సమృద్దిగా ఉండే ఆహారం సీడ్స్, నట్స్, పాలకూర, బ్రోకలీ, కివీ ఫ్రూట్, మామిడి, టొమాటో వంటివి ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల నెలసరి సమయంలో ఉండే నొప్పుల్నించి ఉపశమనం పొందవచ్చు. 

విటమిన్ డి ఆహారం

సూర్యరశ్మిలో పుష్కలంగా లభించే విటమిన్ డి  పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పుల్ని తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. లేదా విటమిన్ డి ట్యాబ్లెట్స్ కూడా తీసుకోవచ్చు. 

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆహారం

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని కణాలు సక్రమంగా పనిచేసందుకు స్వెల్లింగ్, పెయిన్ వంటి సమస్యల్ని తగ్గించేందుకు దోహదపడతాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో నొప్పులపై ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చియా సీడ్స్, వాల్‌నట్స్, ఫ్లక్స్ సీడ్స్, సాల్మన్ ఫిష్, మెకోరాల్, , ఎడామో బీన్స్ వంటివి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link