Sabja Seeds For Hair Growth : ఈ గింజలు నానబెట్టిన నీళ్లు తాగితే చాలు..పట్టుకుచ్చుల్లాంటి, ఒత్తైన, నల్లని జుట్టు మీ సొంతం..!!

Sun, 11 Aug 2024-8:00 pm,

Sabja Seeds : అమ్మాయిలకు జుట్టు అందం. జుట్టు ఎంత పొడుగ్గా, లావుగా ఉంటే వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. ఆస్తులు పోయినా సరే కానీ జుట్టు రాలుతే మాత్రం ప్రాణం పోయినట్లు విలవిలలాడుతుంటారు. జుట్టు రాలేందుకు కారణాలేన్నో ఉండొచ్చు. హార్మోన్లలోపం, ఒత్తిడి, నిద్రలేమి, జీవనశైలిలో మార్పులు, పోషకాహార లోపం ఇవన్నీ కూడా జుట్టు రాలేందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. అయితే జుట్టు రాలే సమస్యకు  పరిష్కారం కోసం ఎన్నో రకరకాల ఉత్పత్తులను వాడుతుంటారు. ప్రొడక్టుల కోసం వేలాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. అయితే మనకు ఇంట్లోనే సులభంగా దొరికే సబ్జా గింజలతో జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు అంటున్నారు. సబ్జా గింజలు గింజలు నానబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే జుట్టు రాలే సమస్య తగ్గుతుందని చెబుతున్నారు. ఎలాగో చూద్దాం.   

సబ్జా నీళ్లు  సబ్జానీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ముఖ్యంగా వేసవి  కాలంలో సబ్జా నీళ్లు తాగితే శరీరంలో డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతాయి. అంతేకాదు ఈ సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి ఆ నీటిని తాగితే ఎన్నో లాభాలు ఉన్నాయి.   

జుట్టు రాలడం ఈ మధ్యకాలంలో చాలా మందిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నవారు ప్రతిరోజూ ఉదయాన్నే సబ్జా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే కచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే సబ్జా గింజల్లోని పోషకాలు జుట్టు మూలాలను ద్రుఢంగా ఉంచుతాయి.   

గ్లాసు నీటిలో చెంచా సబ్జా గింజలు  ప్రతిరోజూ ఒక చెంచా సబ్జాగింజలను ఒక గ్లాసు నీటిలో వేసి కనీసం అరగంటపాటు నాననివ్వాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక చెంచా నెయ్యి, సగం నిమ్మరసం పిండి తాగాలి.   

రెగ్యులర్ గా తాగడం ఈ సబ్జాగింజల నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల జుట్టు రాలే సమస్యలే కాకుండా గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. 

సబ్జాలో పోషకాలు  సబ్జాగింజల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో పీచు, ప్రోటీన్లు అధిక మోతాదులో ఉన్నాయి. బరువు తగ్గాలనుకునేవారు సబ్జా గింజలను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.   

నోట్: ఇక్కడ పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే. జీ తెలుగు దీనిని ధృవీకరించలేదు. మీరు ఈ హోం రెమెడీని పాటించే ముందు వైద్యుల సహా తీసుకోవడం తప్పనిసరి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link