World Cup 2023: ప్రపంచకప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ప్లేయర్లు వీళ్లే..!
క్రికెట్ దేవుడుగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ 45 వన్డే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో మొత్తం 27 సిక్సర్లతో అగ్రస్థానంలో ఉన్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గుంగూలీ 21 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 25 సిక్సర్లు కొట్టాడు.
ప్రపంచకప్‌లో ఆడిన 17 మ్యాచ్‌ల్లో 23 సిక్సర్లతో ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు.
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రపంచకప్‌లో ఆడిన 22 మ్యాచ్‌ల్లో 18 సిక్సర్లు కొట్టాడు.
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని 29 ప్రపంచకప్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 15 సిక్సర్లు బాదాడు.
భారత్‌కు మొదటి వరల్డ్ కప్ అందించిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వన్డే ప్రపంచకప్‌లో 26 మ్యాచ్‌ల్లో 14 సిక్సర్లు కొట్టాడు.