Most Dangerous Roads: ఈ రోడ్లపై ప్రయాణం కాస్త అటు ఇటైనా.. ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి
బేబర్ట్ డీ 915 హైవే, టర్కీ
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర రోడ్డుగా ప్రాచుర్యంలో ఉంది. బేబర్ట్ హైవేను రష్యా సైనికులు 1916లో శక్తివంతమైన సోగ్‌నలీ పర్వతం ఒడ్డున నిర్మించారు.
సియాచిన్-టిబెట్ హైవే, చైనా
1954లో అధికారికంగా తెర్చిన ఈ హైవే నిర్మాణం సందర్బంగా వేయి కంటే ఎక్కువ కూలీలు మృత్యువాత పడ్డారు.
కారాకోరమ్ ఫ్రెండ్‌షిప్ హైవే, చైనా-పాకిస్తాన్
4 వేల 714 మీటర్ల ఎత్తులో ఉన్న కారాకోర్స్ హైవే భూమిపై ఉన్న అత్యంత ఎత్తైన పక్కా రోడ్ . దీనినే ప్రపంచపు 8వ వింతగా పిలుస్తారు.
నార్త్ యుగాంస్ రోడ్, బొలీవియా
ఈ రోడ్‌కు ఉన్న మరో పేరు రోడ్ ఆఫ్ డెత్. వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ రోడ్డుపై ఏడాదికి 3 వందలమంది ప్రమాదానికి లోనయి...మరణిస్తుంటారు.
గువోలియాంగ్ టన్నెల్ రోడ్, చైనా
చైనాలోని తైహాంగ్ పర్వతాల్లో ఉన్న ఈ టన్నెల్ రోడ్..1972-77 మధ్య స్థానికంగా ఉన్న 13 మంది బలమైన టీమ్ ద్వారా నిర్మితమైంది. ఈ పనంతా చేతితో చేసింది కావడం విశేషం