AK-521: ప్రపంచంలోనే అతి ప్రమాదకర రైఫిల్ ఇదే..నిమిషానికి వేగమెంతో తెలుసా
ఏకే 521 రైఫిల్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువేనట. ఇందులో 7,62 x 39 మరియు 5,56 x 45 బుల్లెట్స్‌ను ఉపయోగిస్తారు. దుర్బేధ్య ప్రాంతాల్లో మొహరించిన సైనికులు కూడా ఈ రైఫిల్‌ను అత్యంత సులభంగా వినియోగించవచ్చు. కలాశ్నికోవ్ కన్సర్న్ ( Kalashnikov concern ) కంపెనీ త్వరలోనే ఉత్పత్తి పూర్తి చేసి..మిత్రదేశాలకు అమ్మకానికి పెట్టనుందని తెలుస్తోంది.
Ak 500 సిరీస్‌లోని ఇతర రైఫిల్స్‌లానే ఇందులో కూడా అప్పర్ అండ్ లోవర్ రిసీవర్ ఉంటుంది. ఈ రైఫిల్‌లో ఎక్కువ ఒత్తిడిని తట్టుకునేవిధంగా విడిభాగాల్ని మెటల్‌తో చేశారు. అటు రైఫిల్ మరియు మేగజీన్‌కు ఎగువన హోల్డింగ్ పాయింట్స్‌పై పాలిమర్ ప్రయోగించారు.
ఏకే 521 రైఫిల్ రేంజ్ 8 వందల మీటర్ల వరకూ ఉంటుంది. అంటే దాదాపు 8 వందల మీటర్ల దూరంలో ఉన్న శత్రువును సైతం ఈ రైఫిల్ టార్గెట్ చేయగలదు. అయితే కంపెనీ ఇంకా అధికారికంగా రైఫిల్ రేంజ్ గురించి ప్రకటన జారీ చేయలేదు.
ఈ ఏకే 521 రైఫిల్‌లో ఆప్ట్రిక్స్ బైండింగ్ , బ్యారెల్ మధ్య ఓ బలమైన లోహాన్ని వినియోగించారు. దీంతో ఆపరేషన్ లేదా మెయింటెనెన్స్ సందర్బంగా ఇందులో లోపం తలెత్తే అవకాశముండదు. కేవలం ఒక్క నిమిషంలోనే వేయి బుల్లెట్లు కురిపించగల వేగం ఏకే 521 సొంతమట.
కలాశ్నికోవ్ కన్సర్న్‌కు చెందిన ఏకే 47 రైఫిల్స్ ప్రపంచంలో 25 కంటే ఎక్కువ దేశాల్లో సైనికులు వినియోగిస్తున్నారు. మెయింటెనెన్స్ కారణంగా ప్రపంచంలోని తీవ్రవాద సంస్థలు కూడా ఎక్కువగా ఏకే 47ను ఇష్టపడుతుంటారు.