Costly Fishes: ప్రపంచంలో అత్యంత ఖరీదైన చేపలు, ధర తెలిస్తే షాక్ కొడుతుంది

Thu, 17 Oct 2024-11:38 pm,

ప్రపంచవ్యాప్తంగా ఫిష్ మార్కెట్ చాలా పెద్దది. చాలా దేశాలకు ఇదొక పెద్ద వ్యాపారం కూడా. చేపల వేలం కూడా జరుగుతుంది. అత్యంత ఖరీదైన చేపలేవో చూద్దాం.

American Glass Eel

ఈ చేప నార్త్ అమెరికాకు చెందిన నార్త్ ఈస్ట్ తీరంలో లభిస్తుంది. ఇది ప్రపంచంలో రెండవ అత్యంత ఖరీదైన చేప. ఇది చూసేందుకు గాజులా కన్పిస్తుంది. ఆకారంలో చాలా చిన్నది. 3 ఇంచెస్ ఉంటుంది. 4 అడుగుల వరకూ పెరుగుతుంది. పౌండ్ చేపలు 3 వేల డాలర్లు అంటే 2,52,181 రూపాయలు

Bluefin Tuna

అత్యంత ఖరీదైన చేపల గురించి తెలుసుకుంటే అందులో మొదటి పేరు బ్లూఫిన్ ట్యూనా. ఇవి ఆకారంలో చాలా పెద్దవి. టార్పిడోలా ఉంటుంది.. క్రాస్ సెక్షన్‌లో సర్క్యులర్ ఉంటుంది. ఈ చేప ఖరీదు పౌండ్‌కు 5000 డాలర్లు అంటే 4 లక్షల 20 వేలు. ఇది అత్యంత రుచికరమైంంది ఆరోగ్యకరమైంది.

Sword Fish

ఈ చేప పేరుకు తగ్గట్టే స్వోర్డ్‌లా ఉంటుంది. ఈ చేప అట్లాంటిక్ మహా సముద్రంలో ఉంటుంది. ఈ చేప 91 కిలోల బరువు ఉంటుంది. ప్రతి పౌండ్ 5100 రూపాయలు అంటే 60 డాలర్లు ఉంటుంది.

Wild Alaskan King Salmon

ఈ చేప అలాస్కాలోని అందమైన పరిశుభ్రమైన నీటిలో లభిస్తుంది. ఈ చేప చూసేందుకు రెడ్ కింగ్ సాల్మన్ చేపలా కన్పిస్తుంది. చాలా రుచికరమైన చేప ఇది. ఈ చేప పౌండ్‌కు 70 డాలర్లు ఉంటుంది. అంటే 5,884 రూపాయలు. 

Pufferfish

ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైందే కాకుండా అత్యంత భయంకరమైంది కూడా. ఈ చేపకు ఉండే ముళ్లు అత్యంత విషపూరితమైనవి. రెస్టారెంట్లలో ఈ చేపను సర్వ్ చేస్తారు. ఈ చేప ఖరీదు పౌండ్‌కు 200 డాలర్లు. అంటే 17 వేల రూపాయలు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link