Most Expensive Flowers: ప్రపంచంలో అత్యంత ఖరీదైన 8 పూలేవో తెలుసా

గ్లోరియోసా
ప్రపంచంలో అత్యంత అరుదైన, అత్యంత ఖరీదైన పూలలో ఇదొకటి. గ్లోరియోసా ఆసియా, ఆఫ్రికా వంటి వేడి ప్రాంతాల్లో పండుతుంది.

లిసిఏంథస్
లిసిఏంథస్‌ను ఒక పేపర్ ఫ్లవర్ లాంటిది. ఇవి చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటాయి. ఇవి ఎక్కువ రోజులే పూస్తాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పూలలో ఇదొకటి.

లిల్లీ ఆఫ్ వ్యాలీ
అద్భుతమైన సువాసన వెదజల్లే లిల్లీ ఆఫ్ వ్యాలీ ఇది. వసంతంలో కొన్నిరోజులు మాత్రమే పూచే ఈ పూలు చలి ప్రదేశాల్లో, సమ శీతోష్ణ ప్రాంతాల్లో పండుతాయి.
గోల్డ్ ఆఫ్ కినాబుల్ ఆర్కిడ్
గోల్డ్ ఆఫ్ కినాబుల్ ఆర్కిడ్ కేవలం మలేషియాలోని జాతీయ ఉద్యానవనంలో లభిస్తుంది. ప్రపంచంలోని అతి ఖరీదైన పూలలో ఇదొకటి.
కేసరి
ప్రపంచంలో అత్యంత ఖరీదైన మరో పూవు కేసరి. కుంకుమ పూవు. ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగింది కావడంతో ఇది చాలా ఖరీదైంది.
కడుపుల్ పూవు
నైట్ క్వీన్‌గా పిలుస్తారు. రాత్రి సమయాల్లోనే పూస్తుంది. చాలా ఖరీదైంది. అత్యంత విలువైంది
జూలియట్ రోజ్
ప్రపంచంలోని అతి ఖరీదైన పూలలో ఇదొకటి. ఇది పూయడానికి పదేళ్లకు పైగా సమయం పడుతుంది. అందుకే ఇది చాలా ఖరీదైంది
శెన్‌ఝేన్ నాంగ్‌కే ఆర్కిడ్
8 ఏళ్ల సుదీర్ఘ శ్రమ తరువాత కొందరు పరిశోథకులు ఈ పూవును పండించారు. పరిశోధకుడి పేరే ఈ పూవుకు పెట్టారు. ఇది చాలా విచిత్రమైంది. ఖరీదైంది.