Powerful Passport: ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ ఇదే..ఇండియా స్థానమెంత ?

Thu, 07 Jan 2021-7:00 pm,

ఇండియా పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ విషయానికొస్తే..జాబితాలో 61వ నెంబర్‌లో ఉంది. ఈ ర్యాంకింగ్ అనేది అంతర్జాతీయ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ డేటా ఆధారంగా ఉంటుంది. 

ఆరవ స్థానంలో 5 దేశాలున్నాయి. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్. ఈ దేశస్తులు 186 దేశాలకు వీసా లేకుండా తిరిగి రావచ్చు.

జాబితాలో 5వ స్థానంలో ఆస్ట్రియా, డెన్మార్గ్ దేశాలున్నాయి. ఈ దేశస్థులు 187 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావచ్చు.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ జాబితాలో నాలుగో స్థానంలో నాలుగు దేశాలున్నాయి. అవి ఇటలీ, ఫిన్లాండ్, లగ్జమ్‌బర్గ్, స్పెయిన్. ఈ దేశస్థులు 188 దేశాలకు వీసా లేకుండా వెళ్లి రావచ్చు.

ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న దేశాలు దక్షిణ కొరియా మరియు జర్మనీ. ఈ రెండు దేశాల ప్రజలు 189 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.

జపాన్ గత నాలుగేళ్లుగా ర్యాంకింగ్‌లో టాప్‌లో ఉంది. ఈ జాబితాలో రెండో స్థానంలో సింగపూర్ ఉంది. సింగపూర్ దేశస్థులు 190 దేశాలు వీసా లేకుండా తిరగవచ్చు.

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ( Henley passport index )  2021 జాబితా ప్రకారం జపాన్ పాస్‌పోర్ట్ అత్యంత శక్తివంతమైనదిగా అగ్రస్థానంలో ఉంది. జపాన్ పౌరులు ఈ పాస్‌పోర్ట్ ద్వారా 191 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.

పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్ అంటే అర్దం వీసా లేకుండా ఎన్ని దేశాలు తిరగవచ్చనే దానిపై ఆధారపడి ఉంటుంది.ఈ సౌకర్యాన్ని వీసా ఆన్ అరైవల్ అంటారు. ఈ సౌకర్యంతో మీరు సంబంధిత దేశాలకు వెళ్లేటప్పుడు విడిగా వీసా తీసుకోవల్సిన అవసరం లేదు. అక్కడికి చేరుకున్న తరువాత ఆ దేశమే వీసా ఏర్పాటు చేస్తుంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link