World Saree Day 2024: ప్రపంచ చీరల దినోత్సవం..పెళ్లైనా, పేరంటమైనా చీర కట్టాల్సిందే..ఈ 5 చీరల ప్రత్యేకత ఏంటో చూద్దాం

Sat, 21 Dec 2024-4:22 pm,

World Saree Day 2024: చీరలోని గొప్పతన తెలుసుకో..ఆ  చీర కట్టు ఆడతనం నిలుపుకో అన్నాడో సినీ రచయిత. ఈ రోజు డిసెంబర్ 21న ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సాంప్రదాయ వస్త్ర చీర భారతీయ మహిళల గుర్తింపు. దాని ప్రాముఖ్యతను తెలియజేసేందుకు ప్రపంచ చీర దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఐదున్నర నుంచి 9 గజాల వరకు ఉండే చీర సంప్రదాయమే కాదు..తరాల కథలెన్నో చెబుతుంది. చీరలు మన భారతీయ సంప్రదాయంలో మిలితమైంది.

 సముద్రాలు దాటినా ఇప్పటికీ చీరకట్టులో కనిపించే మహిళలు ఎంతో మంది ఉన్నారు. ప్రస్తుత కాలంలో కూడా స్టైలిష్ గా కనిపించేందుకు రకరకాల డ్రెస్సుల వేసుకున్నా పండగలు, పర్వదినాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లలో మాత్రం ట్రెడిషనల్ గా ఉండేందుకు చీరలు కట్టేందుకు ఇష్టపడుతుంటారు. ఇంత ప్రత్యేకత ఉన్న చీరలకు ఓ రోజు ఉంది. అదే డిసెంబర్ 21. నేడు ప్రపంచ చీరల దినోత్సవం. ఈ ప్రత్యేకత రోజు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

చీరకు సంబంధించిన మూలాలు 5వేల ఏళ్ల క్రితం నుంచే మొదలయ్యాయి. ప్రపంచంలోని అతి పురాతనమైన కుట్టని వస్త్రాలలో చీర కూడా ఒకటి. భారతదేశంలో బనరస్, కంజీవరం, పైథాని,చికంకారి, పటాన్ పటోలా, మూంగా , డోలా పట్టు, జర్దోసీ, ఇలా ఎన్నో  రకాల చీరలు ఉన్నాయి. ఇవన్నీ కూడా భారతదేశ వారసత్వానికి చిహ్నంగా మారుస్తాయి. భారతదేశంలోని 5 ఖరీదైన చీరల గురించి తెలుసుకుందాం. వీటి ధర లక్షల్లో ఉంటుంది.   

ప్రపంచ చీరల దినోత్సవాన్ని జరుపుకోవడం బహుముఖ వస్త్రాన్ని జరుపుకోవడానికి ఒక చొరవగా ప్రారంచారు. భారతదేశంలో స్త్రీల దుస్తులు చీర. సింధు లోయ సంస్కృతి 2,800,  1,800 BC మధ్య వృద్ధి చెందింది. చీర లాంటి డ్రెస్ ఇక్కడ మొదటిసారి కనిపించింది. భారతదేశంతో పాటు, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్,  పాకిస్తాన్‌లలో చీరలను వివిధ రకాలుగా ధరిస్తారు.  

దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ కాంచీపురం చీర చాలా ఖరీదైనది. ఈ చీర దాని పట్టు, అద్భుతమైన పనితనానికి ప్రసిద్ధి చెందింది. దీని ధర లక్ష రూపాయల వరకు ఉంటుంది.  

బనారసి చీర భారతదేశం అంతటా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. ఖరీదైన చీర బ్రాండ్లలో ఇదొకటి. దీన్ని తయారు చేసేందుకు పట్టు దారంతో పాటు బంగారు, వెండి తీగలను ఉపయోగిస్తారు. దీని ధర 50 వేల నుంచి 5 లక్షల వరకు ఉంటుంది. 

పటాన్ పటోలా చీర గుజరాత్‌లోని పటాన్‌లో తయారు చేస్తారు. ఒక చీర తయారు చేయడానికి 3-4 నెలలు పడుతుంది. ఈ చీర రూ.2 లక్షల నుంచి 10 లక్షల వరకు లభిస్తుంది.  

కోరల్ సిల్క్ చీర, జర్దోజీ వర్క్ చీర, ఈ రెండు చీరలు కూడా చాలా ఖరీదైనవి. ఈ ఖరీదైన చీరలను ప్రత్యేకంగా వివాహాలు లేదా ప్రత్యేక వేడుకల కోసం తయారు చేస్తారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link