World Wide Highest Share Movies On Day 1: ఇప్పటికీ RRR పేరిట ఆ రికార్డులను బ్రేక్ చేయలేకపోయిన ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీ.. పార్ట్ 1

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఫస్ట్ డే గ్రాస్ కాకుండా.. రూ. 135 కోట్ల షేర్ రాబట్టి తెలుగు సినిమాల్లో టాప్ ప్లేస్ లో ఉంది.

ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘బాహుబలి 2’ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 123 కోట్ల షేర్ రాబట్టి సెకండ్ ప్లేస్ లో నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 AD’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 100.01 కోట్ల షేర్ తో మూడో ప్లేస్ లో నిలిచింది.
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ సినిమా ఫస్ట్ డే 97.49 కోట్ల షేర్ తో నాల్గో ప్లేస్ లో నిలిచింది.
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సాహో’. ఈ సినిమా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా రూ. 73.64 కోట్ల షేర్ రాబట్టి ఐదవ స్థానంలో నిలిచింది.