Countries with Midnight Sun: రవి అస్తమించని ఆరు దేశాలు, మిడ్ నైట్ సన్ ఎంజాయ్ చేయండి
కెనడా
కెనడాలోని ఉత్తర ప్రాంతంలో ప్రతక్యేకించి నునావృత్‌లో కూడా అర్ధరాత్రి సమయంలో సూర్యుని చూడవచ్చు. ఇక్కడ జూన్ నెలాఖరువరకూ సూర్యాస్తమయం ఉండదు.
అలాస్కా
అమెరికాలోని ఈ ఉత్తర భాగంలో మే నెలాఖరు నుంచి జూలై వరకూ అర్ధరాత్రి సూర్యుడిని చూడవచ్చు. దాదాపుగా 80 రోజులు అలాస్కాలో సూర్యాస్తమయం ఉండదు.
ఐస్‌ల్యాండ్
యూరప్‌లోని ఈ ద్వీప దేశంలో జూన్ నెలలో అసలు రాత్రనేది ఉండదు. ఆకాశంలో సూర్యుడు క్షణకాలం అస్తమించినట్టు కన్పిస్తాడు. కానీ చీకటి పడదు
ఫిన్‌ల్యాండ్
ఫిన్‌ల్యాండ్ ఉత్తర ప్రాంతంలో అర్ధరాత్రి సూర్యుడిని చూడవచ్చు. వేసవిలో అయితే 73 రోజుల వరకూ సూర్యాస్తమయం జరగదు. చలికాలంలో అసలు సూర్యోదయమే ఉండదు.
స్వీడన్
మే నెల ప్రారంభం నుంచి ఆగస్టు చివరి వరకూ స్వీడన్ దేశంలో సూర్యుడు అర్ధరాత్రి అస్తమిస్తాడు. తిరిగి సూర్యోదయం 4 గంటలకు అయిపోతుంది. ఇలా ఏడాదిలో 6 నెలలుంటుంది
నార్వే
నార్వేను ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ అని అంటారు. ఆర్కిటిక్ సర్కిల్ లో ఉండటం వల్ల నార్వేలో జూలై నెలాఖరు వరకూ దాదాపుగా 76 రోజులు సూర్యాస్తమయం జరగదు.