Best Citizenship Offer: ఆ అందమైన దేశం పిలుస్తోంది వెళ్తారా, 7 వారాల్లోనే పౌరసత్వం గ్యారంటీ
వనుఅటు దేశంలోని ఈ సౌకర్యాలు క్రమ క్రమంగా భారతీయుల్ని ఆకర్షిస్తున్నాయి. గత ఏడాదిన్నర వ్యవధిలో దాదాపు 30 మంది ఎన్ఆర్ఐలు వనుఅటు పౌరసత్వం తీసుకున్నారు.
వనుఅటు పాస్‌పోర్ట్ ఉంటే 55 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ
వనుఅటు పాస్‌పోర్ట్ కలిగిన వ్యక్తికి 55 పైగా దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తుంది. 34 దేశాల్లో వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది ఈయూ దేశంలో కూడా సిటిజన్‌షిప్ వీసా ఉచితంగా పొందే వీలుండేది కానీ 2023లో ఈయూ ఈ నిబంధనల్ని మార్చింది.
ఎవరైనా సరే ఈ దేశం పౌరసత్వం పొందాలనుకుంటే యూఏఈ లేదా ఇతర దేశంలో ఏడాది పాటు ఉండి ఎన్ఆర్ఐ హోదా పొందాల్సి ఉంటుంది. ఆ తరువాత యూఏఈలోని ఓ సంస్థ ద్వారా వనుఆటు ప్రభుత్వానికి ఫారిన్ ఫండ్ ఇచ్చి పౌరసత్వం కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 7 వారాల్లో కొత్త పాస్‌పోర్ట్ అందుతుంది.
అన్నింటికంటే ఆసక్తి కల్గించే అంశమేంటంటే అసలు వనుఆటు దేశానికి వెళ్లకుండానే ఆ దేశ పౌరుడిగా మారవచ్చు. ఈ దేశపు ప్రభుత్వం దీనికోసం ఓ ప్రణాళిక రచిస్తోంది. ఈ ప్రణాళిక పేరు సిటిజన్‌షిప్ బై ఇన్వెస్ట్‌మెంట్. ఒకరైతే కోటి రూపాయలిచ్చి, దంపతులైతే కోటిన్నర ఇచ్చి ఈ దేశ పౌరసత్వం పొందవచ్చు
ఇండియన్స్‌కు కొత్త స్థావరంగా వనుఆటు ( Vanuatu)
వనుఆటు ఈ మధ్యకాలంలో భారతీయుల్ని బాగా ఆకర్షిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలోని ఓ చిన్నద్వీపదేశమిది. ఈ దేశం గత కొన్నేళ్లుగా పౌరసత్వం పొందేందుకు, నివాసముండేందుకు బెస్ట్ ఆల్టర్నేటివ్‌గా మారుతోంది.
చాలామంది మాల్టా, గ్రెనడా, సైప్రస్ వంటి దేశాల బలమైన పాస్‌పోర్ట్ దక్కించుకునేందుకు ఓ మాధ్యమంగా వనుఅటు పౌరసత్వం వినియోగిస్తుంటారు. వనుఅటు పౌరసత్వం తీసుకుంటే ఆ దేశాల్లో కూడా పౌరసత్వం పొందవచ్చు.
వనుఅటు పౌరసత్వానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. భారతదేశంలో ట్యాక్సెస్ నుంచి తప్పించుకునేందుకు, బ్లాక్ మనీ దాచేందుకు వనుఅటు బెస్ట్ డెస్టినేషన్.