DR BR Ambedkar statue: హైదరాబాద్ లో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి ఘోర అవమానం..
బాబాసాహేబ్ అంబేద్కర్ జయంతిని దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రపంచ మేధావి, ఆయన చూపించిన దార్శనికత వల్ల నేడు దళితులు, అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా అనేక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా రిజర్వేషన్ లపై ఆయన తీసుకున్న నిర్ణయాలు అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపాయి.
హైదరాబాద్ లోని సెక్రెటెరియట్ వద్ద ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశంలోనే అత్యంత భారీ ఎత్తున జరిగిన కార్యక్రమం సీఎం కేసీఆర్, అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ చేతుల మీదుగా జరిగింది. ఈ విగ్రహం ఆవిష్కరణ కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలో ఘనంగా జరిగింది.
ఈ విగ్రహానికి శిల్పి రామ్ వంజీ సుతార్, 98 సంవత్సరాల వయస్సులో పద్మభూషణ్ పురస్కారం పొందారు. 2023 ఏప్రిల్ 14న ప్రారంభోత్సవ వేడుకకు కూడా ఆయనకు ఆహ్వానం అందించారు. ఇదిలా ఉండగా.. ఈరోజు అంబేద్కర్ జయంతి నేపథ్యంలో ఆ విగ్రహాన్ని ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు.
కనీసం విగ్రహాన్ని శుభ్రం చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకొక పోవడంపై దళిత సంఘాలు రేవంత్ సర్కారుపై మండిపడుతున్నాయి. సెక్రెటెరియట్ ముందున్న ప్రపంచలోని ఎత్తైన విగ్రహానికి ఇదేనా..కాంగ్రెస్ నేతలు ఇచ్చే గౌరవమంటూ ఎద్దెవా చేస్తున్నారు.
గత బీఆర్ఎస్ హాయాంలో అత్యంత వేడుకగా డాక్టర్ బాబా సాహేబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆయన ప్రపంచ మేధావి. ఎందరికో రాజ్యంగం ద్వారా సాధించాల్సిన ఆశయాలు,హక్కులను ప్రజలకు తెలిసేలా చేశారు. అలాంటి మహానీయుడి జయంతి రోజున ఆయన విగ్రహానికి కనీసం శుభ్రం చేయకపోవడం, పూల మాల వేసి నివాళులు అర్పించక పోవడం పట్ల పలువురు నేతలు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు.
సీఎం రేవంత్ కు కనీసం అంబేద్కర్ విగ్రహంను పట్టించుకునే తీరిక కూడా లేదా.. అంత భారీ విగ్రహాం కన్పిస్తున్న కూడా, నివాళులు అర్పించి, పూలమాలలు సమర్పించాలన్న విషయంకూడా ప్రత్యేకంగా గుర్తు చేయాలా.. అంటూ కొందరు నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.