ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆ ఐదు సిగరెట్ బ్రాండ్స్ ఏంటో తెలుసా..ధర వింటే ఆశ్చర్యమే
ఆస్ట్రియాకు చెందిన Net Sherman Cigarette ప్రపంచంలోని ప్రసిద్ధ లగ్జరీ సిగరెట్ బ్రాండ్. 1930లో ప్రారంభమైన ఈ కంపెనీ సిగరెట్ ప్యాకెట్ ధర దాదాపు 7 వందల రూపాయలుంది.
Parliament Cigarette ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన బ్రాండ్. అందరికీ సుపరిచితమైన మాల్‌బరో బ్రాండ్‌కు చెందింది. ఈ సిగరెట్ ప్యాకెట్ ధర 350 నుంచి 850 రూపాయలుంది.
Sobrane Cigarette ఇది కూడా అతి ఖరీదైన బ్రాండ్. ఇది ఇంగ్లండ్‌కు చెందిన మరో కంపెనీ. ఒక ప్యాకెట్ ధర 480 నుంచి 9 వందల వరకూ ఉంది.
ఇక Davidoff Cigarette ఒక స్విస్ కంపెనీ బ్రాండ్. ఈ సిగరెట్ ఒక ప్యాకెట్ ధర దాదాపు వేయి రూపాయలు
ప్రపంచంలో అత్యంత ఖరీదైన సిగరెట్ బ్రాండ్ Treasurer.ఇంగ్లండ్ టొబాకో కంపెనీకు చెందిన ప్రముఖ బ్రాండ్ ఇది. ఒక ప్యాకెట్ ఖరీదు 4 వేల 5 వందల రూపాయలు.