Highest Paid Job: స్విచ్ ఆన్ చేసే ఉద్యోగానికి 30 కోట్ల జీతం, ఎవరూ ఎందుకు సాహసించడం లేదు
ఈజిప్పుకు వచ్చే ఓడలకు దారి చూపించేందుకు మద్యలో ఉండే పెద్ద పెద్ద కొండలకు ఓడలు ఢీ కొట్టకుండా కాపాడేందుకు లైట్ హౌస్ నుంచి లైట్ నిరంతరం ఫోకస్ అవుతుంటుంది. ఇది ప్రపంచంలో మొదటి లైట్ హౌస్ ఇదే.
ప్రాణ ముప్పు
లైట్ హౌస్ కీపర్ సముద్రం మధ్యలో ఉండే లైట్ హౌస్‌లో ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. అతనితో మాట్లాడేందుకు ఎవరూ ఉండరు. దరిదాపుల్లో మానవ సంచారం ఉండదు. సముద్రం మధ్యలో ఉండే లౌట్ హౌస్ ఒక్కోసారి తుపాన్లలో చిక్కుకోవచ్చు. ఒక్కోసారి సముద్రపు కెరటాలు లైట్ హౌస్‌పై వరకూ వచ్చేస్తుంటాయి. అంటే ప్రాణాంతకం కావచ్చు
ప్రపంచంలోని అతి క్లిష్టమైన ఉద్యోగం
ఈ లైట్ హౌస్ కీపర్ ఉద్యోగం ఒక్కటే. లైట్ నిరంతరం వెలుగుతూ ఉండేలా చూసుకోవడమే. మిగిలిన సమయమంతా ఏం చేసుకున్నా ఫరవాలేదు. వినడానికి చాలా సులువుగా ఉన్నట్టుంటుంది కానీ వాస్తవంలో చాలా సవాళ్లుంటాయి. ప్రపంచంలో అత్యంత క్లిష్టమైన ఉద్యోగంగా భావిస్తారు
యజమాని ఒత్తిడి ఉండదు
ఈ ఉద్యోగంలో 24 గంటలు మిమ్నల్ని వెన్నంటి ఉండే యజమాని ఇతరులెవరూ ఉండరు. ఏడాదిలో అడపా దడపా మాత్రమే యజమానిని కలిసే అవకాశముంటుంది. ఇంత సులువైన ఉద్యోగమైనా సరే ఎవరూ ముందుకు రావడం లేదు
ఏడాదికి 30 కోట్ల జీతం
ఈ లైట్ హౌస్ కీపర్ జీతం ఏడాదికి 30 కోట్ల రూపాయలు. బహుశా ప్రపంచంలో అత్యధిక జీతమిచ్చే ఉద్యోగం ఇదే కావచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పడుకోవచ్చు. ఫిషింగ్ చేసుకోవచ్చు. ఈ ఉద్యోగి చేయాల్సిందల్లా లైట్ హౌస్ లైట్ వెలుగుతూ ఉండేలా చూడటమే
జీతం కోట్లలో ఉంటుంది. యజమాని ఒత్తిడి ఉండదు. పని భారం అంతకంటే లేదు. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు. ఈ ఉద్యోగం అలెగ్జాండ్రియాలోని ఫారోస్ అనే ద్వీపంలో ఉన్న లైట్ హౌస్ ఆఫ్ అలెగ్జాండ్రియా కీపర్ ఉద్యోగం.