Yamadeepdaan 2024: నరక చతుర్దశి రోజు యమ దీపం వెలిగిస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి..
కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఈ నరక చతుర్దశి రోజున ధన్వంతరి, లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజిస్తారు. అయితే యమ దేవుడికి మాత్రం ఈ రోజు సాయంత్రం పూట యమ దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని వెలిగించి.. యమ ధర్మరాజును కోరికలు కోరుకుంటారు.
ఛోటీ దీపావళి మీరు కూడా ఈ యమ దీపాన్ని వెలిగించాలనుకుంటున్నారా? ఇలా చేయండి.. యమ దీపాన్ని పెట్టేవారు ఈ దీపాన్ని తప్పకుండి గోధుమ లేదా బియ్యం పిండితో దీపాలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది.
గోధుమ పిండితో దీపాన్ని తయారు చేసుకుని నాలుగు వైపులా ఒత్తులు పెట్టుకుని దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది. అయితే ఈ దీపాన్ని వెలిగించాలుకునేవారు కేవలం నువ్వుల నూనెతో మాత్రమే దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది.
కొంతమంది ఈ దీపాన్ని ఆవు నెయ్యితో కూడా వెలిగిస్తారు. అయితే ఈ దీపాన్ని వెలిగించిన తర్వాత దాని చుట్టూ గంగాజలం చల్లి.. ఇంటికి ప్రధాన ద్వారం నుంచి ఉంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రధాన ద్వారం దగ్గర దక్షిణ దిశలో ఉంచాల్సి ఉంటుంది.
దీపాపం వెలిగించే ముందు తప్పకుండా దాని కింద ధాన్యం వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పెట్టిన దీపం ముందు యముడిని విశ్వాసంతో, భావోద్వేగంతో పూజించాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శ్రేయస్సు, ఆనందం లభిస్తుంది.
ఈ సంవత్సరం నరక చతుర్దశి అక్టోబర్ 30వ తేదిన వచ్చింది. ఇది మధ్యాహ్నం 1:15 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత చతుర్దశి తిథి గురువారం అక్టోబర్ 31వ తేదిన ముగుస్తుంది. ఈ రోజు యమ దీపాన్ని వెలిగించడం వల్ల పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి.
అలాగే ఈ యమ దీపం వెలగించడం వల్ల జీవితంలో ఎలాంటి సమస్యలైనా సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.