Yamaha Rajdoot 350 Price: నాడు ఓ ఊపు ఊపిన రాజ్‌దూత్ 350 బైక్స్ మళ్లీ వస్తున్నాయ్.. ఫీచర్స్, ధర వివరాలు ఇవే!

రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్ అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మోటర్ సైకిల్ అద్భుతమైన కొత్త ఫీచర్స్‌తో లాంచ్ అయ్యే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో ప్రత్యేకమైన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కూడా అందిస్తోంది.

అలాగే ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్‌లో మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా డబుల్ డిస్క్ బ్రేకింగ్ సిస్టమన్ కూడా అందిస్తోంది. దీంతో పాటు ప్రీమియం ట్యూబ్‌లెస్ టైర్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.

కొత్త రాజ్‌దూత్ మోటార్‌సైకిల్ 349.86 cc ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే పవర్‌ఫుల్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఊహాగానాల ప్రకారం ఈ మోటర్‌సైకిల్ ABS డ్యూయల్-ఛానల్‌తో రాబోతోంది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని కూడా అందిస్తోంది.
అలాగే ఈ మోటర్‌సైకిల్‌కి సంబంధించిన మైలేజీ వివరాల్లోకి వెళితే.. ఇది లీటర్ పెట్రోల్‌కి 35 కిలోమీటర్ల మైలేజ్‌ను అందించే ఛాన్స్ ఉంది. దీంతో పాటు ఈ బైక్ అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలను కంపెనీ త్వరలోనే ప్రకటించనుంది.
ఇక ఈ రాజ్‌దూత్ 350 మోటర్‌సైకిల్ ధర వివరాల్లోకి వెళితే.. ఇది ఇటీవలే రాయల్ ఎనిఫిల్డ్ విడుదల చేసిన హంటర్ ధర కంటే చాలా తక్కువే ఉండే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించిన వివరాలు కూడా కంపెనీ త్వరలోనే వెల్లడించనుంది.