Yamaha Rx100 New Model Pics Viral: యువతకు గుడ్ న్యూస్.. మళ్లీ Yamaha Rx100 వచ్చేస్తోంది.. ఫీచర్స్ క్రేజీ ఉంటాయ్!
రాబోయే Yamaha RX100 మోటర్ సైకిల్ క్లాసిక్ అప్పీల్‌తో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్, ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
యమహా ఆర్‌ఎక్స్100 మోటర్ సైకిల్స్‌కి భారత్‌లో మంచి చరిత్ర ఉంది. ఇది టూ-స్ట్రోక్ ఇంజన్ నోట్‌కు ఆ బైక్ చాలా ప్రసిద్ధిగా భావించవచ్చు. అయితే ఇప్పుడు రాబోయే కొత్త మోటర్ సైకిల్ అద్భుతమైన ఇంజన్ పనితీరులో విడుదల కాబోతోంది.
కొత్త Yamaha RX100 మోటర్ సైకిల్ 98cc ఫోర్-స్ట్రోక్ ఇంజన్‌తో విడుదల కాబోతోంది. ఇది లీటర్‌కు దాదాపు 40-45 kmpl మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా ఇది సిటీ కమ్యూటింగ్‌కి చాలా బాగా పని చేస్తుంది.
ఇక ఈ బైక్‌కి సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది అద్భుతమైన క్లాసిక్‌లో విడుదల కానుంది. అంతేకాకుండా ప్రత్యేకమైన స్టైలింగ్ లుక్‌లో కనిపించనుంది. దీంత పాటు గత మోడల్ డిజైన్ కంటే ఈ మోడల్ డిజైన్ చాలా బాగుంటుంది. దీనిని కంపెనీ వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఈ మోటర్ సైకిల్ అద్భుతమైన హెడ్‌లైట్‌తో పాటు టెయిల్‌లైట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ప్రత్యేకమైన LED లైటింగ్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్స్‌ను కూడా కలిగి ఉంటాయి. దీని ధర రూ.1.25 లక్షల నుంచి ప్రారంభం కాబోతోంది.