Top 5 Batsmen in IPL 2023: ఐపిఎల్ 2023లో ఇరగదీస్తోన్న ఐదుగురు యువ ఆటగాళ్లు

Fri, 28 Apr 2023-5:07 am,

యశస్వి జైశ్వాల్ ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో మొత్తం 227 పరుగులు చేశాడు. ఐపిఎల్ 2023 సీజన్‌లో 37వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేశాడు, ఈ సీజన్‌లో ది బెస్ట్ ఓపెనర్స్‌లో యశస్వి జైశ్వాల్ కూడా ఒకడు అనిపించుకునేలా తన ఆట తీరును కనబర్చాడు. (Image Source: Instagram)

ముంబై ఇండియన్స్ ఆటగాళ్లలో కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారా అంటే అందులో తిలక్ వర్మ కూడా ఒకరు అని చెప్పుకోవచ్చు. గతేడాది ముంబై ఇండియన్స్ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచిన తిలక్ వర్మ.. ఐపిఎల్ 2023లో ఆడిన 7 మ్యాచుల్లో 219 పరుగులు చేశాడు. ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించాలంటే తిలక్ వర్మ తన ఫామ్‌ని కొనసాగించడం ఎంతైనా కీలకం కానుంది. (Image Source: Instagram)

కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు రింకూ సింగ్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచుల్లో 62.75 సగటుతో 251 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ కూడా 150కి పైగా ఉండటం గమనార్హం. (Image Source: Instagram)

ఐపిఎల్ 2023 లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆడిన 7 మ్యాచ్‌ల్లో 40.57 సగటుతో, 142.71 స్ట్రైక్ రేట్‌తో 284 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. (Image Source: Instagram)

ఐపీఎల్ 2023లో హై స్కోరర్ పరంగా టాప్ 10 బ్యాట్స్‌మెన్ జాబితాలో రుతురాజ్ గైక్వాడ్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో రుతురాజ్ గైక్వాడ్ 270 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం విశేషం. డెవాన్ కాన్వేతో కలిసి రుతురాజ్ గైక్వాడ్ పార్ట్‌నర్‌షిప్ ఈ సీజన్‌లో చాలా కీలకంగా నిలిచింది. (Image Source: Instagram)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link