Yashasvi Jaiswal GF: యశస్వి జైస్వాల్ గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మను మించిన అందగత్తె..!

ఈ ఏడాది స్వదేశంలో ఇంగ్లండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు యశస్వి జైస్వాల్. అంతేకాకుండా రెండు డబుల్ సెంచరీలు చేశాడు.

యశస్వి జైస్వాల్ ప్రస్తుతం ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు. అయితే ఈ 2024 సీజన్ లో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.

తాజాగా జైస్వాల్ డేటింగ్ రూమర్ తెరపైకి వచ్చింది. యశస్వి గర్ల్ ఫ్రెండ్ మనదేశానికి చెందిన అమ్మాయి కాదట. ఆ అమ్మాయిది ఇంగ్లండ్ కు చెందినదని సమాచారం.
జైస్వాల్ ఈ అమ్మాయితో మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నట్టు సమాచారం. ఆమె పేరు మాడీ హామిల్టన్. ఆ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి 'ఫ్యామిలీ' అని క్యాప్షన్ కూడా పెట్టాడు.
చాలా సార్లు మ్యాడీ ఐపీఎల్ జెర్సీ ధరించి స్టేడియంలో కనిపించి సందడి చేసింది. అయితే ఈ విషయాలన్నింటిపై జైస్వాల్ స్పందించడం లేదు.