Year Ender 2024: బాలీవడ్ లో పుష్ప గాడి మరో సంచలన రికార్డు.. ‘బాహుబలి 2’ తర్వాత ఆ రికార్డు ‘పుష్ప 2’ దే..

Mon, 23 Dec 2024-5:35 am,

1.పుష్ప 2 ది రూల్..

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా  తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా హిందీలో మొదటి రోజే మన దేశంలో  రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1లో నిలిచింది. తాజాగా ఈ సినిమా రూ. 632.50 వసూల్లతో బాహుబలి తర్వాత హిందీలో ఇండస్ట్రీ రికార్డు నమోదు చేసింది.  తాజాగా ఈ సినిమా ఆదివారం వసూళ్లతో రూ. 700 కోట్ల నెట్ కలెక్షన్స్ క్లబ్బులో ప్రవేశించడం పక్కా చెబుతున్నారు.

2.స్త్రీ 2 - శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసిన  లేడీ ఓరియండెట్ మూవీ ‘స్త్రీ 2’. ఈ మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 627 కోట్లతో అప్పటి వరకు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. తాజాగా పుష్ప 2 రాకతో ఈ సినిమా రెండో ప్లేస్ లో నిలిచింది.

3. జవాన్ - షారుఖ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో   తెరకెక్కిన చిత్రం ‘జవాన్’. ఈ చిత్రం మన దేశంలో ఫస్ట్ డే రూ. 65.50 కోట్ల నెట్ వసూళ్లలో పుష్ప 2 వరకు టాప్ లో ఉంది. ఈ సినిమా రూ. 583 కోట్ల నెట్ వసూళ్లు హిందీ వెర్షన్ రాబట్టింది. అన్ని భాషల్లో కలిపి మన దేశంలో రూ. 643 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. 

4. గదర్ 2..

అనిల్ శర్మ దర్శకత్వంలో సన్ని దేవోల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గదర్ 2’. ఈ సినిమా మన దేశంలోనే రూ. 525.45 కోట్ల నెట్ వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా తాజాగా పుష్ప 2తో టాప్ 4లో నిలిచింది.

5. పఠాన్ -

షారుఖ్ హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో  తెరెక్కిన మూవీ ‘పఠాన్’. ఈ చిత్రం మన దేశంలోనే  రూ. 524.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం పుష్ప 2 రాకతో టాప్ 5లో నిలిచింది. ఈ సినిమా ఇతర భాషల్లో కలిపి మన దేశంలో రూ. 543 కోట్లను రాబట్టింది. 

6.బాహుబలి 2..

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ తెరకెక్కిన మూవీ ‘బాహుబలి 2’ . ఈ సినిమా హిందీలో రూ. 511 కోట్ల వసూళ్లతో టాప్ లో నిలిచింది. 

7.యానిమల్..

సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్,రష్మిక మందన్న జంటగా   తెరకెక్కిన మూవీ ‘యానిమల్’. ఈ చిత్రం హిందీ బాక్సాఫీస్ దగ్గర ఫస్ట్ డే రూ. 54.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఈ సినిమా మన దేశ బాక్సాఫీస్ దగ్గర రూ. 503 కోట్ల నెట్ వసూళ్ల మిగిలిన అన్ని భాషల్లో (రూ. 556 కోట్ల నెట్)ను సాధించింది.  

 

8.కేజీఎఫ్ 2 - KGF 2

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన మూవీ ‘కేజీఎఫ్ 2’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2’ చిత్రం.. హిందీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మన దేశంలో రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీలో రూ. 435.20 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

9.దంగల్..

ఆమీర్ ఖాన్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో రూ. 374.45 కోట్ల (అన్ని భాషల్లో కలిపి రూ. 387.4 కోట్ల) నెట్ వసూళ్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

10.సంజు - సంజయ్ దత్ జీవితంపై తెరకెక్కిన చిత్రం రూ. 342.55 కోట్ల నెట్ వసూళ్లను టాప్ 10లో సాధించింది.

11.PK - రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో ఆమీర్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘పీకే’. ఈ సినిమా రూ. 341 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 11లో నిలిచింది. 

12. టైగర్ జిందా హై -సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘టైగర్ జిందా హై’. ఈ సినిమా మన దేశంలో హిందీలో రూ. 340 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link