Year Ender 2024: ఈ ఏడాది ఇప్పటివరకు అరెస్టు అయిన సెలబ్రిటీస్ వీళ్లే..!
ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది సినీ సెలబ్రిటీలకు పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.. ముఖ్యంగా కుటుంబంలోని వివాదాలు అలాగే ఎఫైర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం, ఇంకొన్ని ఇబ్బందులు.. అలా సమస్యలు ఎదుర్కొన్న వారిలో చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు. మరి అలా టాలీవుడ్ నుంచి ఫిర్యాదులతో ఇబ్బంది పడ్డ సెలబ్రెటీల విషయానికి వస్తే..
టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్. తన దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న లేడీ కొరియోగ్రాఫర్.. తనపై లైంగిక దాడి చేశారని ఆరోపణలు చేయడంతో జానీ మాస్టర్ ను అరెస్టు చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా కేవలం కుట్ర అని అభిమానులైతే నమ్ముతున్నారు. అంతేకాకుండా జాతీయ అవార్డును కూడా కోల్పోయారు.
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ కూడా లావణ్య అనే యువతని కొన్నేళ్లు ప్రేమించి, వాడుకొని మరీ మోసం చేశారనే ఫిర్యాదుతో ఒక్కసారిగా సిని ఇండస్ట్రీ ఉలిక్కిపడింది. ఒక నెలపాటు ఈ హడావిడి జరిగినా ఆ తర్వాత ప్రేక్షకులు కూడా మరిచిపోయారు.
కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా పేరుపొందిన దర్శన్, తన అభిమానిని చంపిన కేసులో చిక్కుకున్నారు. ముఖ్యంగా రేణుక స్వామి హత్య.. నటి పవిత్ర కోసమే అనే ఆరోపణలు కూడా వినిపించాయి.
టాలీవుడ్ హీరోయిన్ కస్తూరి శంకర్ కూడా ఎప్పుడు వివాదాలకు దారితీస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఈమె బహిరంగ ప్రసంగాలలో తెలుగు ప్రజలను సైతం కించపరిచే విధంగా మాట్లాడడంతో అగ్గిరాజుకుంది. ఏకంగా ఈమె పైన పలు రకాల కేసులు కూడా నమోదయ్యాయి. తమిళనాడు పోలీసులు కూడా అరెస్టు చేసినట్లు సమాచారం.
టాలీవుడ్ లో బడా ఫ్యామిలీ గా పేరు పొందిన మంచు ఫ్యామిలీ కూడా ఆస్తి గొడవల వల్ల అటు మోహన్ బాబు, తన కుమారుడు మనోజ్ తో గొడవలు పడడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు. ఈ విషయం కూడా జైల్ వరకు వెళ్లిన విషయం తెలిసిందే
ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ మీద కేసు నమోదు కావడంతో అల్లు అర్జున్ ని ఇటీవలే.. పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.. ఈ విషయం పైన ఫ్యాన్స్ అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇది కావాలనే కుట్రలో భాగంగానే ఇలా చేస్తున్నారనే విధంగా ఆరోపిస్తున్నారు. అయితే కేవలం 6:00 లోనే ఇన్ టర్మ్ బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు ఈ హీరో..