Year Ender 2024 Disaster Movies: 2024 టాలీవుడ్ టాప్ డిజాస్టర్స్ ఇవే..
2024లో సంక్రాంతి నుంచే హిట్ మూవీస్ తో పాటు ఫ్లాప్ మూవీల పరంపర మొదలైంది. వెంకటేష్ సైంధవ్ తో మొదలై.. ఆ తర్వాత ఈగిల్, ఆపరేషన్ వాలెంటైన్ తో కంటిన్యూ అయి.. ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ తో పాటు వరుణ్ తేజ్ మట్కా వరకు ఫ్లాపులు తెలుగు చిత్ర పరిశ్రమను కుదేలయ్యేలా చేసింది.
సైంధవ్..
శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఆపరేషన్ వాలెంటైన్...
వరుణ్ తేజ్ హీరోగా మానుషి చిల్లర్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఆపరేషన్ వాలెంటైన్’. 2019లోజరిగిన పుల్వామా ఎటాక్ నేపథ్యంలో తెరెక్కిన ఈ సినిమా టాలీవుడ్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.
ఫ్యామిలీ స్టార్..
విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది.
డబుల్ ఇస్మార్ట్..
రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమా అందరి అంచనాలను తలకిందలు చేస్తూ డబుల్ డిజాస్టర్ గా నిలిచింది.
మిస్టర్ బచ్చన్..
రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హిందీలో హిట్టైన ‘రెయిడ్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా బొక్క బోర్లా పడింది.
మట్కా..
వరుణ్ తేజ్ హీరోగా కరుణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మట్కా’. ఈ సినిమా కనీస వసూళ్లను రాబట్టలేక నెగిటివ్ షేర్ తో రికార్డు క్రియేట్ చేసింది.
వీటితో పాటు లవ్ మీ, ఈగిల్, అల్లరి నరేష్ ఆ ఒక్కటీ అడక్కు, నిఖిల్ హీరోగా నటించిన అపుడో ఇపుడో ఎపుడో.. అంజలి కథానాయికగా నటించిన గీతాంజలి మళ్లీ వచ్చింది, గం గం గణేషా వంటి చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచాయి.