Year Ender 2024: పుష్ప 2, దేవర, కల్కి సహా ఈ యేడాది తెలుగు గడ్డపై 100 కోట్లకు పైగా దుడ్డు రాబట్టిన చిత్రాలు..

Wed, 18 Dec 2024-5:50 am,

ఒకప్పుడు ఓ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం అనేది చాలా రేర్ అని చెప్పాలి.  కానీ  రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సిరీస్ పుణ్యామా అని ఇపుడు మన తెలుగు చిత్రాలు ఈజీగా బాక్సాఫీస్ దగ్గర రూ. 100 కోట్లను కొల్లగొడుతున్నాయి. 2024లో కూడా మెజారిటీ చిత్రాలు రూ. 100 కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఆ సినిమాలేమిటో మీరు ఓ లుక్కేయండి..

పుష్ప 2 ది రూల్..

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలైన భారతీయ బాక్సాఫీస్ దగ్గర ఈ యేడాది అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా దాదాపు రూ. 1500 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం మొదటి రోజు రూ. 294 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.  ఈ సినిమా తెలుగులో రూ. 200 కోట్ల షేర్ (రూ. 300 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.

కల్కి 2898 AD..

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1111 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.ఈ మూవీ 2024లో మొదటి రోజు  రూ. 191 కోట్ల గ్రాస్ వసూల్లతో నెంబర్ ప్లేస్ లో నిలిచింది.

దేవర పార్ట్ 1.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా ఓవరాల్ గా రూ. 501 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ చిత్రం ఫస్ట్ డే  దాదాపు రూ. 170 కోట్ల గ్రాస్ వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించింది.

 

హనుమాన్.. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో  తెరకెక్కిన చిత్రం ‘హనుమాన్’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా  దాదాపు రూ. 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో సంచలనం రేపింది.

గుంటూరు కారం..

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన  చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ ఓవరాల్ గా దాదాపు రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. 

టిల్లు స్క్వేర్.. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ టాక్ తో రూ. 132 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది.

లక్కీ భాస్కర్.. వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్ హీరోగా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లక్కీ భాస్కర్’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 108 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు సమాచారం.

సరిపోదా శనివారం.. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సరిపోదా శనివారం’. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు సమాచారం.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link