Money Tips: పావు ఎకరం ఉంటే చాలు.. ఏడాది రూ. 10లక్షలు వెనకేసుకోవచ్చు..ఏం చేయాలంటే?
Good Income With coriander business: కొత్తిమీర లేకుండా కోడికూరను ఊహించుకోలేము. కొత్తిమీర లేని పచ్చిపులుసును తినలేము. అయితే చాలా మంది రకరకాల బిజినెస్ లు చేస్తుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు ఇంటిబాధ్యతలు, పిల్లలను చూసుకుంటూ సమయాన్ని గడుపుతుంటారు. అయితే ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా చాలు ఏదొకటి చేయాలని ఆలోచిస్తుంటారు. అలాంటివారికి ఈ బిజినెస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తిమీరతో ఎన్ని లాభాలో వారికి తెలుసు.
గ్రామాల్లో ఉండే మహిళలు అయితే ఇంటి ముందు ఏమాత్రం ఖాళీ స్థలం ఉన్నా చాలు రకరకాల కూరగాయలతోపాటు కొత్తిమీరను కూడా పెంచుతుంటారు. పట్నంలో ఉండేవారైతే..చిన్న చిన్న డబ్బాల్లో కొత్తిమీరను పెంచుతారు. అయితే గ్రామాల్లో ఉండేవారు దీన్ని బిజినెస్ గా మలుచుకోవచ్చు. పావు ఎకరం పొలంలో కొత్తమీరను సాగు చేస్తే నెలకు రూ. 50వేల వరకు సంపాదించవచ్చు.
ముఖ్యంగా పావు ఎకరం పొలంలో కొత్తిమీరను అలకాలి. దీనికోసం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. పావు ఎకరానికి అరకిలో ధనియాలు కొనుగోలు చేయాలి. దుక్కి దున్ని తర్వాత ధనియాలను పోయాలి. అయితే ధనియాలు మంచి నాణ్యత ఉన్నవి కొనుగోలు చేయాలి. వీటిని కొన్న తర్వాత ఒక రోజు ఎండ ఎండబెట్టి వాటిని చేతుతో నలపాలి. రెండు బాగాలుగా విడిపోతాయి.
వాటిని దుక్కిలో అలకాలి. తర్వాత నీళ్లు పెట్టాలి. అయితే కొత్తమీర సాగు కు పెద్దగా నీళ్లు అవసరం ఉండదు. ధనియాలు విత్తిన 15 రోజుల తర్వాత మొలకలు వస్తాయి. వీటికి బయట మార్కెట్లో దొరికే ఎరువుల కంటే ఆవు, గేదె పేడను ఎరువుగా వాడితే పంట బాగా వస్తుంది. కొత్తిమీర కూడా ఎక్కువ రోజులు ఉంటుంది. మార్కెట్లో దొరికే ఎరువులు వాడితే కొత్తిమీర కుళ్లిపోతుంది.
కొత్తిమీర చేతికి రావడానికి దాదాపు 30 నుంచి 35రోజుల సమయం పడుతుంది. ఇది ఎదిగిన తర్వాత చిన్న చిన్న కట్టలుగా కట్టి మార్కెట్లోకి తరలించవచ్చు. మార్కెట్ కు మీరే స్వయంగా తీసుకెళ్లి అమ్మితే ఇంకా లాభం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలా మంది హోటల్స్ వాళ్లు కొత్తిమీరు సంచుల కొద్దీ కొనుగోలు చేస్తారు. ఇలా వారికి సప్లే చేస్తే కూడా ఒకేసారి మొత్తంలో డబ్బు చేతికి వస్తుంది.
ఈ పంట ఒక పంట కోసే సమయానికి మరో పంట వేస్తే నిరంతరం ఈ కొత్తిమీర సాగు ఉంటుంది. ఒక్క కట్టను 25 నుంచి 50 రూపాయల చొప్పున రోజుకు 100 కట్టలు అమ్మినా అన్ని ఖర్చులు పోనూ రోజుకు 3 నుంచి 4 వేల వరకు మిగులుతుంది. ఇలా నెలపాటు అమ్మితే 50వేలకు పైగానే సంపాదించవచ్చు. దీనికి పెద్దగా శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలాంటి చిన్న చిన్న ఐడియాలతో మహిళలు మంచి ఆదాయం పొందుతున్నవారు ఎంతో మంది ఉన్నారు.