MS Dhoni: అల్లుడిని మించిన అత్త.. ఎంఎస్ ధోనీ కన్నా ఆస్తులు ఆమె వద్దనే? ఎన్ని కోట్లు తెలుసా?
![Who Is MS Dhoni Mother In Law MS Dhoni Mother In Law Assets Worth](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/whoisMsdhonimotherinlaw_0.jpg)
వ్యాపారస్తురాలిగా? ధోని అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందుతున్న ధోనీ అత్త గురించి తెలుసుకుందాం.
![MS Dhoni Mother In Law Company Details MS Dhoni Mother In Law Assets Value](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/whoismsdhonimotherinlaw.jpg)
సాక్షి తల్లి: ధోని క్రికెటర్‌గానే కాకుండా విజయవంతమైన వ్యాపారవేత్త కూడా. ధోని ఒక్కడే కాదు అతడి అత్త షీలా సింగ్ కూడా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఆమెకు వందల కోట్ల విలువైన కంపెనీ కలిగి ఉన్నారు.
![MS Dhoni Sakshi Mother MS Dhoni Sakshi Mother Bussiness](https://telugu.cdn.zeenews.com/telugu/sites/default/files/msdhonimotherinlawsheilasinghnews.jpg)
ధోని అత్త ఎవరు? ధోని, అతడి భార్య సాక్షి గురించి దాదాపుగా అందరికీ తెలుసు. అయితే సాక్షి తల్లి, ధోని అత్త షీలా సింగ్ వ్యాపారంలో విశేషంగా గుర్తింపు పొందారు.
ధోని పేరుతో మొదలై: ధోనీ భార్య సాక్షి 2019లో 'ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్' పేరుతో ఓ కంపెనీని ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రారంభమైన మరుసటి ఏడాది అంటే 2020లో ఆమె తల్లి షీలా సింగ్ చేరారు.
వ్యాపారంలో అత్తకే పెత్తనం: ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ యజమాని సాక్షి ధోనీ. ఆమె తల్లి షీలా సింగ్ కాదు. ఈ కంపెనీలో సాక్షి మెజారిటీ షేర్లు ఉన్నాయి. అయితే సాక్షి తన తల్లికి పూర్తి అధికారాలు ఇచ్చారు. షీలా సింగ్ కంపెనీలో గణనీయమైన వాటా కలిగి ఉండడమే కాకుండా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటారు. ముఖ్యమైన నిర్ణయాలు ధోని అత్తనే తీసుకుంటారు.
వెయ్యి కోట్ల వ్యాపారం: తల్లీ కూతుళ్లు షీలా సింగ్, సాక్షి కలిసి ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని గొప్పగా చేశారు. నాలుగు సంవత్సరాలలో రూ.800 కోట్ల టర్నోవర్‌కు చేర్చారు.
వ్యాపారంలో బిజీగా: చాలా వ్యాపారాలలో సాక్షి బిజీగా ఉన్నారు. తన తల్లితో కలిసి రూ.800 కోట్ల కంపెనీని నడపడమే కాకుండా హాకీ క్లబ్‌కు సహ యజమానిగా సాక్షి ఉన్రుడు. సాక్షి, ధోనీ కలిసి ఈ హాకీ క్లబ్‌ను నడుపుతున్నారు. ధోని కూడా చాలా వ్యాపారాలలో బిజీగా ఉన్నారు. అతడి నికర విలువ రూ.వెయ్యి కోట్లకు పైగా ఉంది.