New Rules 2021: కొత్త చట్టాలతో 2021 నుంచి మీ జీతంపై ప్రభావం
నివేదికల ప్రకారం ఈ కొత్త చట్టం వల్ల మీ జీతం కొద్ది మేరకు తగ్గే అవకాశం ఉందట. మీ జీతం.. మీకు వచ్చే జీతం కాస్త వేరుగా ఉండనుంది. గ్రాట్యూటి, పీఎఫ్‌లపై ప్రభావం కనిపించనుందట.
గత సంవత్సరం ప్రభుత్వం కొత్త వేతన చట్టాన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. ఇది వచ్చే ఏడాది 2021 నుంచి అమలులోకి రానుంది. అన్ని రంగాల ప్రజలపై దీని ప్రభావం పడనుంది.
ఎకనామిక్ టైమ్స్ ప్రకారం గ్రాట్యూటీ, పీఎఫ్ లాంటివి మొత్తం జీతంలో 50 శాతాన్ని మించరాదు. అంటే 2021 నుంచి బేసిక్ ఆధారంగా వీటిని కౌంట్ చేసే అవకాశం ఉంది.
దీని ప్రకారం మీకు చేతికి అందే జీతం బాగా తగ్గనుంది.పెద్ద పెద్ద జీతాలు తీసుకునే వారిపై కూడా దీని ప్రభావం కనిపించనుందట.దీంతో కంపెనీలపై కూడా ప్రభావం కనిపించనుంది.