YS Jagan Vs Sharmila: షర్మిలకు జగన్ ఎమోషనల్ లెటర్.. మటాష్ చేసేందుకే కుట్ర..
YS Jagan Vs Sharmila: వై.యస్. రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో వివాదం తారా స్థాయికి చేరింది. ఈ వివాదాన్ని ఆయన ప్రత్యర్థులు తమ మీడియా ద్వారా హైలెట్ చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే YCP అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాసిన మరో లేఖ బయటకు వచ్చింది. ఈ లేఖను జగన్ తన చెల్లెలు షర్మిలకు రాశారు. గత ఆగస్టులో రాసినట్లుగా వున్న ఈ లేఖను వైసీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. జగన్, షర్మిల ఆస్తి వివాదం నేపథ్యంలో ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ లేఖను విడుదల చేస్తున్నట్లు వైసీపీ తెలిపింది.
వైఎస్ జగన్‌ను రాజకీయాల్లో లేకుండా చేయాలనే కుట్రలు జరుగుతున్నాయని పేర్కొంది. ప్రజలకు వాస్తవాలు తెలియాలన్నదే వైసీపీ ఉద్దేశమని తెలిపింది. ఈ లేఖలో వైఎస్ జగన్ అనేక విషయాలు ప్రస్తావించారు.
చెల్లెలు షర్మిలకు జగన్ భావోద్వేగంతో ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రత్యర్దుల వలలో చిక్కి సొంత అన్నకు వెన్నుపోటు పొడుస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు వైయస్ షర్మిలకు జగన్.. తండ్రి ఆస్తిలో ఎపుడో భాగం ఇచ్చారు.
మరోవైపు జగన్ తన సొంతంగా సంపాదించుకున్న ఆస్తిలో కూడా ఏ అన్న చేయనట్టు కూతుళ్లతో పాటు చెల్లికి ఆస్తిని రాసిచ్చారు.అలాంటి అన్నపై రాజకీయంగా పదవి ఇవ్వలేదనే కక్ష్యతో ఇలా ప్రవర్తించడాన్ని అన్న జగన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. మొత్తంగా ప్రత్యర్థులు ఉచ్చులో పడి సొంత అన్నకు తీరని అన్యాయం చేస్తుందని వైసీపీ తన అధికారిక ఖాతాలో లేఖ పోస్ట్ చేసింది.