YSR Vahanamitra scheme: వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం ఆర్థిక సాయం నేటి నుంచే ఖాతాల్లోకి

Tue, 15 Jun 2021-7:28 am,

వాహనమిత్ర పథకంలో భాగంగానే ఈ ఏడాది కూడా వారికి ఆర్థిక సహాయం అందించేందుకు ఏపీ సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసుకుంది. (Image credits: Twitter photo)

తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం జరగనున్న కార్యక్రమంలో వర్చువల్ విధానంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ (AP CM YS Jagan) లబ్ధిదారుల ఖాతాల్లో సొమ్మును జమ చేయ‌నున్నారు. (Image credits: Twitter photo)

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం (YSR Vahanamitra scheme) కింద రాష్ట్రవ్యాప్తంగా 2,48,468 మంది ట్యాక్సీ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున ఆర్థిక సహాయం అందనుంది. (Image credits: Twitter photo)

ట్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం తీసుకొచ్చిన వాహనమిత్ర పథకం అమ‌లు చేసేందుకు ఏపీ సర్కారు (AP govt) రూ.248.47 కోట్లు వెచ్చిస్తోంది. (Image credits: Twitter photo)

ఆటో, మ్యాక్సీ క్యాబ్, ట్యాక్సీ డ్రైవర్లు (Auto drivers, taxi drivers) వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం అందుకోనున్నారు. (Image credits: Twitter photo)

జూన్ 15న వైఎస్సార్ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయం విడుదల చేయాల్సి ఉండగా.. కొత్తగా దరఖాస్తు (How to apply for YSR Vahanamitra scheme) చేసుకునే వారికి జూన్ 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వడం విశేషం. (Image credits: Twitter photo)

ఇదిలావుంటే, మరోవైపు తెలంగాణలోనూ ఇవాళ్టి నుంచే రైతులకు రైతు బంధు పథకం (Rythu Bandhu Scheme money) కింద తెలంగాణ సర్కారు అందించే ఆర్థిక సహాయం కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో (Farmers bank accounts in TS) జమ కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link