King Cobra: ఆస్పత్రిలో 12 అడుగుల నల్ల నాగుపాము హల్‌చల్.. రోగులు, డాక్టర్ల పై ప్రాణాలు పైకే!
12 Feet Black King Cobra Enters In Hospital Patients And Doctors Panicked: రోగులకు వైద్యం అందిస్తూ బిజీగా ఉన్న ఆస్పత్రిలోకి నిగనిగలాడుతూ హొయలొలికిస్తూ 12 అడుగుల నాగుపాము దూరింది. అది చూసిన ఆస్పత్రిలోని వారికి పై ప్రాణాలు పైనే పోయాయి.
Black King Cobra: వర్షాకాలం కావడంతో పాములు అటవీ ప్రాంతం నుంచి ఆరుబయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో అటవీ ప్రాంతంలో నివసిస్తున్న స్థానికుల మధ్యకు వచ్చి హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో అటవీ పరివాహక ప్రాంత ప్రజలు బెంబేలెత్తుతున్నారు. విష సర్పాలు తరచూ తిరుగుతుండడంతో కంటి మీద నిద్ర లేకుండాపోతున్నది. ఇన్నాళ్లు జనావాసాల్లోకి చొచ్చుకొచ్చిన పాములు ఇప్పుడు ఆస్పత్రి బాట పట్టాయి. తాజాగా ఓ ఆస్పత్రిలో భారీ పాము హల్‌చల్ చేసింది. అది 12 అడుగుల పొడవు ఉండగా దాన్ని పట్టుకునేందుకు తీవ్ర కష్టాలు పడాల్సి వచ్చింది. పాము దూరడంతో రోగులు భయాందోళనతో బయటకు వచ్చారు. అయితే ఆ పాము నల్లటి రంగులో నిగనిగలాడుతూ కనిపించి హడలెత్తించింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Shocking Incident: వీళ్లు స్కూల్ పిల్లలా? వీధిరౌడీలా.. బాలికపై పిడిగుద్దుల వర్షం
అల్లూరి జిల్లా మోతుగూడెంలో ఏపీ జెన్‌కో ఆస్పత్రి ఉంది. స్థానికులతోపాటు జెన్‌కో ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు వైద్య సేవలు అందుతుంటాయి. సోమవారం యథావిధిగా ఆస్పత్రిలో రోగులు చికిత్స పొందుతున్నారు. ఔట్ పేషెంట్ విభాగంలో వైద్యులు, వైద్య సిబ్బంది తమ సేవల్లో నిమగ్నమైన సమయంలో అకస్మాత్తుగా ఓ బీరువా కిందకు పాము దూరింది. అది కనిపించకుండా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది 'బుస్ బుస్' అంటూ బుసలు కొడుతున్న శబ్ధం వినిపించింది. రెండు మూడు సార్లు పట్టించుకోలేదు. కానీ తరచూ వస్తుండడంతో అనుమానంతో బీరువా కింద చూశారు. అంతే హడలెత్తిపోయారు.
Also Read: Girl Friend Attack: నిఖాలో ప్రియురాలి తడాఖా.. పెళ్లి మండపంలో యాసిడ్, కత్తితో దాడి
నల్లటి రంగులో నిగనిగలాడుతూ 12 అడుగుల పాము చొరబడిన విషయం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. రోగుల గుండెల్లో రైళ్లు పరుగులెత్తాయి. వెంటనే పాము దూరిన గదికి తాళం వేశారు. అనంతరం స్థానికులను పిలిపించారు. ఓ కర్రతో బీరువా కింద ఉన్న పామును బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. కర్రతో కదిలించడంతో వెంటనే పాము బయటకు వచ్చి పడగ ఎత్తి దూసుకొచ్చేలా చేసింది. మళ్లీ కర్రతో దానిని కదిలించడంతో పాము ప్రాణభయంతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది.
అయితే చుట్టూ జనాలు చుట్టుముట్టడం.. బయటకు వెళ్లే మార్గం లేక పాము కొంత ఇబ్బంది పడింది. కొద్దిసేపు శ్రమ తర్వాత అటవీ శాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. భారీ పామును అతికష్టంగా ఆ పామును బంధించారు. పట్టుకున్న నలుపు పామును సమీపంలో పెద్ద అడవిలో వదిలేశారు. పామును సురక్షితంగా పట్టకోవడంతో ఆస్పత్రి వైద్యులు, రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఆస్పత్రిలో తరచూ ఇలా పాములు చొరబడుతున్నాయని వారు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా పాము దూరిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పామును చూసి వామ్మో ఎంత పెద్ద పాము అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter