King Cobra Video: భయంకరమైన పాముల్ని చూస్తేనే అల్లంత దూరం పారిపోతుంటాం. అలాంటిది కింగ్ కోబ్రాతో ఆటలాడటం, ముద్దు పెట్టడం, చివరికి అదే పాము కాటుకు గురి కావడం..ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంటర్నెట్ ప్రపంచంలో జంతువుల వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా పాముల వీడియోలకు క్రేజ్ ఎక్కువ. పాములంటేనే అల్లంత దూరం పారిపోతుంటాం. ఒళ్లంతా వణుకు పుడుతుంది. అలాంటిది ఓ వ్యక్తి..ఏకంగా 15 అడుగుల కింగ్ కోబ్రాతో ఆటలాడే వీడియో చూస్తే ఒళ్లు జలదరించేస్తుంది. 


ఈ వీడియోలో ఓ వ్యక్తి కోతిని వెంటబెట్టుకుని తోటలో వెళ్తాడు. అటూ ఇటూ తిరిగి 15 అడుగుల కోబ్రాను వెతికి మరీ పట్టుకుంటాడు. ఆ పామును పట్టుకోగానే అంతెత్తున ఎగురుతుంది. కాటేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయినా తప్పించుకుని..లాఘవంగా పట్టుకుంటూ ఆటలాడుతుంటాడు. ఆఖరికి ఆ పాము కళ్లలో కళ్లు పెట్టుకుని..ఆఖరికి ముద్దు కూడా పెట్టుకుంటాడు. చివరికి పాము కాటేస్తుంది కూడా.



వెంటనే అరచేతిపై కాటేసిన చోట చిన్న కత్తితో కట్ చేసుకుని..ప్రాధమిక చికిత్స చేసుకుంటాడు. చివరికి అలాగే ఆ పామును పట్టుకుని బంధిస్తాడు. ఈ వీడియో చూస్తున్నంతసేపు ఒకటే జలదరిస్తుంటుంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది. 


Also read: King Cobra: వామ్మో ఆ పామును చూడండి.. స్నేక్‌ క్యాచర్‌ను ఏం చేసిందో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook