9 fit king cobra found in bedroom agumbe Karnataka snake man rescued: వర్షాకాలంలో పాములు ఎక్కువగా ఇళ్లకు వస్తుంటాయి. అడవికి దగ్గరగా ఉన్న ఇళ్లలో పాములు ఎక్కువగా కన్పిస్తుంటాయి. ముఖ్యంగా గుట్టలు, కొండలు, చెట్లు ఎక్కుువగా ఉన్న చోట్ల పాములు ఎక్కువగా వస్తుంటాయి. పొలాలకు దగ్గరగా ఉన్న ఇళ్లలో కూడా పాములు తరచుగా కన్పిస్తుంటాయి. ఇవిబియ్యం బస్తాలు, వడ్లుఉన్న ప్రాంతంలోని ఎలుకల్ని తినేందుకు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో.. కొన్నిసార్లు మనుషుల్ని కాటు వేస్తుంటాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



పాములు కాటు వేయగానే సరైన సమయంలో యాంటీ వీనమ్ తీసుకుంటే ప్రమాదం నుంచి బైటపడోచ్చు. పాములకు చెందిన వీడియోలు ఎక్కువగా తరచుగా వార్తలలో ఉంటాయి. నెటిజన్లు సైతం పాములకు చెందిన కంటెంట్ ను ఎక్కువగా చూస్తుంటారు. వీడియోలను తరచుగా షేర్ చేస్తుంటారు. తాజాగా, ఒక పాము బెడ్ రూమ్ లో సజ్జ మీద వచ్చి కూర్చుంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.


పూర్తి వివరాలు..


కర్ణాటకలోని అగుంబే ప్రాంతంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సోమేశ్వర్ అనే ప్రాంతంలో ఒక ఇంట్లో కింగ్ కోబ్రా వచ్చి కూర్చుంది. అది కూడా సదరు ఇంట్లోని బెడ్ రూమ్ లోని సజ్జ మీద 9 ఫీట్ల కింగ్ కోబ్రా బైటపడింది. అక్కడున్న యజమాని సజ్జ మీద ఏదో చప్పుడు రావడంతో మెల్లగా ఎక్కిచూశారు. అతనికి కింగ్ కోబ్రా తోక కన్పించింది. వెంటనే దగ్గరలోని స్నేక్ సొసైటీ వాళ్లకు సమాచారం ఇచ్చారు.


రంగంలోకి దిగిన స్నేక్ రెస్క్యూ టీమ్..బెడ్ రూమ్ పైకి ఎక్కి కింగ్ కోబ్రాను తీశారు. దాన్ని చాకచక్యంగా పట్టుకుని మెల్లగా బైటకు తీసుకొచ్చారు. అంతేకాకుండా.. దాన్ని ఎంతో కష్టపడి మరీ బంధించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కింగ్ కోబ్రా.. ఆ ఇంట్లోకి ప్రవేశించడం ఒక ఎత్తైతే.. ఆ సజ్జ మీద ఎప్పుడు ఎక్కి కూర్చుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున ఆ పాము కాటు వేస్తే.. పరిస్థితి ఏంటని కూడా నెటిజన్ లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి