వీడియో: గన్‌తో బెదిరించాడు.. కానీ తుర్రుమన్నాడు!
బ్యాంకులో చోరీ చేసేందుకు తుపాకీతో దర్జాగా వెళ్లాడు. కానీ బ్యాంకు సిబ్బంది సమయస్ఫూర్తి, ధైర్యానికి భయపడి కాళ్లకు బుద్ధిచెప్పాడు దొంగ.
ఏదైనా ఆపద వస్తే ముందుగా ధైర్యం తెచ్చుకోవాలి. ఆలోచించి మనం వేసే అడుగు, తీసుకునే చర్య అవతలివారిని హడలెత్తించాలి. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. తుపాకులతో బ్యాంకులోకి ప్రవేశించి దోపిడీకి యత్నించిన నిందితుడు క్యాషియర్ చేసిన పనితో తుర్రుమన్నాడు. సినిమా సీన్‌లా అనిపిస్తున్న ఈ బ్యాంకు దోపిడీ ప్రయత్నం వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్ నగరంలో బార్గి ఏరియాలో సెంట్రల్ బ్యాంకు ఉంది. మంగళవారం (ఫిబ్రవరి 18న) ఓ వ్యక్తి బ్యాంకులోకి ప్రవేశించాడు.
Also Read: బికినీలో బిగ్ బాస్ బ్యూటీ.. వైరల్
ముసుగు ధరించిన ఆ వ్యక్తి అంతలోనే తుపాకీ బయటకు తీసి అందర్నీ హెచ్చరించాడు. ఆ వెంటనే క్యాషియర్ దగ్గరకు వెళ్లి తుపాకీ చూపించి బెదిరించి డబ్బు గుంజే యత్నం చేశాడు. అయితే సమయస్ఫూర్తిని ప్రదర్శించిన క్యాషియర్ అలారమ్ బటన్‌ను ప్రెస్ చేశారు. తాను దొరికిపోతానేమేనని భయాందోళనకు గురైన నిందితుడు పరారయ్యాడు. బ్యాంకు సిబ్బంది నుంచి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Also Read: ఇంత హాట్‌గానా.. నటి టాప్‌లెస్ ఫొటోకు ఫ్యాన్స్ షాక్!
Also Read: మహిళ మృతదేహాన్ని వెలికితీసి గుండుగీసి!