Electron Bot Malware: మీ ఫేస్‌బుక్, గూగుల్ ఎక్కౌంట్లకు పొంచి ఉన్న ప్రమాదం, కొత్తరకం వైరస్, తస్మాత్ జాగ్రత్త
Electron Bot Malware: మీ ఫేస్‌బుక్ ఎక్కౌంట్ ప్రమాదంలో పడింది. హ్యాక్ అయ్యే అవకాశముంది. భారీ నష్టాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ఎలక్ట్రాన్ బాట్ అనే ఓ వైరస్ కారణంగా ఫేస్‌బుక్, గూగుల్ ఎక్కౌంట్ల హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ ప్రమాదకర వైరస్ గురించి తెలుసుకుందాం.
Electron Bot Malware: మీ ఫేస్‌బుక్ ఎక్కౌంట్ ప్రమాదంలో పడింది. హ్యాక్ అయ్యే అవకాశముంది. భారీ నష్టాన్ని ఎదుర్కోవల్సి వస్తుంది. ఎలక్ట్రాన్ బాట్ అనే ఓ వైరస్ కారణంగా ఫేస్‌బుక్, గూగుల్ ఎక్కౌంట్ల హ్యాకింగ్‌కు గురవుతున్నాయి. ఈ ప్రమాదకర వైరస్ గురించి తెలుసుకుందాం.
ఇంటర్నెట్ విస్తృతి పెరిగే కొద్దీ సోషల్ మీడియో ఉపయోగం అధికమౌతోంది. మీకు కూడా సోషల్ మీడియా వేదికల్లో ఎక్కౌంట్ ఉంటే మీ కోసం అత్యవసర సూచన ఇది. ఫేస్‌బుక్ యూజర్ల ఎక్కౌంట్లపై ఓ కొత్త వైరస్ ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే ఈ కొత్త వైరస్ చాలా ఎక్కౌంట్లను హ్యాక్ చేసింది. ఫేస్‌బుక్‌తో పాటు గూగుల్ ఎక్కౌంట్లను కూడా ఈ వైరస్ ఎటాక్ చేసింది. ఈ వైరస్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
సోషల్ మీడియా ఎక్కైంట్లను హ్యాక్ చేస్తున్న ప్రమాదకర వైరస్
చెక్ పాయింట్ రీసెర్చ్‌కు చెందిన ఓ నివేదిక ప్రకారం కొత్త మాల్వేర్ ఎలక్ట్రాన్ బాట్ వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ మీడియా ఎక్కౌంట్లపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ రిపోర్ట్స్ ప్రకారం వైరస్ యూజర్లకు చెందిన గూగుల్, ఫేస్‌బుక్ ఎక్కౌంట్లపై దాడి చేస్తోంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 5వేలకు పైగా ఎక్కౌంట్లను హ్యాక్ చేసింది.
ఈ మాల్వేర్ ఎలా పని చేస్తుంది
ఈ వైరస్ మీ ఎక్కౌంట్లపై ఎలా దాడి చేస్తుందో తెలుసుకోలనుకుంటే ఈ ఆర్టికల్ చదవండి. సులభంగా అర్ధమౌతుంది. చాలా సులభంగా ఇతర యాప్స్ ద్వారా మీ ఎక్కౌంట్ల యాక్సెస్ తీసుకుంటుంది. ముఖ్యంగా టెంపుల్ రన్, సబ్‌వే సర్ఫర్ వంటి గేమ్స్ ద్వారా ఈ మాల్వేర్ విస్తరించిందని తెలుస్తోంది. అక్కడి నుంచి మీ సోషల్ మీడియా ఎక్కౌంట్లను యాక్సెస్ చేస్తుంది. వాస్తవానికి ఈ గేమ్స్ యాప్స్‌ను మాధ్యమంగా చేసుకుని యూజర్ల ఎక్కౌంట్లపై ఎలక్ట్రాన్ బాట్ దాడి చేయడం ప్రారంభిస్తోంది. ఈ ఎలక్ట్రాన్ బాట్ అనే మాల్వేర్ మీ సిస్టమ్‌ను కంట్రోల్ చేస్తూ..ఫేస్‌బుక్, గూగుల్ ఎక్కౌంట్లకు చెందిన పూర్తి సమాచారాన్ని యాక్సెస్ చేస్తుంది. ఈ మాల్వేర్ సహాయంతో హ్యాకర్..యూజర్ డివైస్‌పై ఓ కొత్త ఎక్కౌంట్ రిజిస్టర్ చేస్తాడు. దాని ద్వారా యూజర్‌కు చెందిన సోషల్ మీడియా ఎక్కౌంట్లను వినియోగించుకుంటాడు. ఈ వైరస్..గూగుల్‌కు చెందిన ఆల్బమ్స్ యాప్, గూగుల్ ఫోటోస్‌లో కన్పించింది. అంటే ఈ యాప్స్ ద్వారా వైరస్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎంటర్ కాగలదు.
ఇటువంటి వైరస్ నుంచి సురక్షితంగా ఉండాలంటే మీ ఫోన్‌లో యాంటీ వైరస్ యాప్ డౌన్ లోడ్ చేయడం మర్చిపోవద్దు. ఏ విధన థర్డ్ పార్టీ యాప్‌ను డౌన్ లోడ్ చేయవద్దు. ఎందుకంటే దాని ద్వారా వైరస్ మీ స్మార్ట్‌ఫోన్‌లో ప్రవేశిస్తుంది.
Also read: Indian Railways: ఛార్ట్ సిద్ధమైన తరువాత కూడా టికెట్ రద్దు చేసుకుంటే రిఫండ్, ఎలాగంటే, ఐఆర్‌సీటీసీ తాజా అప్‌డేట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook