Viral video : ఆ మూగజీవాల ‘ఫ్రెండ్షిప్’కి నెటిజనులు ఫిదా.. ఏకంగా 13 మిలియన్లకు పైగా వ్యూస్
Viral video: ఒకే రక్తం పంచుకోని పుట్టుకపోయిన..జీవితాంతం మన వెంట నిలిచేవాడు మిత్రుడు. స్నేహ బంధం కేవలం మనుషులకు మాత్రమే ఉంటుందనుకుంటే పొరపాటే. నోరులేని మూగ జీవాల మధ్య కూడా ఈ మైత్రి బంధం ఉంటుంది. అది కూడా వేర్వేరు జాతుల జీవిల మధ్య. తాజాగా ఇదే కోవకు చెందిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. వివరాల్లోకి వెళితే..
Viral video: స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు...ప్రపంచం మన చేతిలో ఉన్నట్టే. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనకు తెలుసుపోతుంది. కొన్ని వింతైనా వీడియోలు నెట్టింట తెగ వైరల్(Viral) అవుతుంటాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెటిజన్లను ఫిదా చేస్తోంది. కోతి- మేక కలిసి బెర్రీలు తింటున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాల్ చల్ చేస్తోంది.
వీడియో ఓపెన్ చేస్తే...అడవిలో ఓ వ్యక్తి చేతిలో బెర్రీ(Berry)సి పట్టుకొని మేకను పిలుస్తాడు. అతడి పిలుపు విని మేక(Goat) అడవి నుండి బయటకు వచ్చి అతని వైపు పరిగెత్తింది. ఆశ్చర్యకరంగా, ఒక పిల్ల కోతి(Monkey) దాని మెడకు వేలాడుతూ కనిపిస్తుంది. మేక పై సవారీ చేసుకుంటూ అక్కడికి చేరుకుంటుంది కోతి. ఆతర్వాత అతడి చేతిలో ఉన్న బెర్రీలను మేక- కోతి తినడం ప్రారంభిస్తాయి.
Also Read: Female Man: 16 ఏళ్ల యువతికి గడ్డం-మీసాలు.. ఆ ఒక్క నిర్ణయంతో ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ
వీటిలో మొదట మేక, వాటిని ఒక్కొక్కటిగా తినడం ప్రారంభిస్తుంది. కానీ కోతి కాస్త గందరగోళంగా ఉంది. కొద్దిసేపటి తరువాత, కోతి కూడా చేరి బెర్రీని తినడం మొదలు పెట్టింది. టెస్ట్ నచ్చిందనుకుంటా మేక పైకి ఎక్కి మరీ బెర్రీలను లాగించింది కోతి. ఇప్పుడు ఈవీడియో(Video) నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ మూగ జీవుల మైత్రి(Friend Ship) బంధానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు ఈ వీడియోని 13 మిలియన్ల మందికి పైగా చూశారు. అంతే కాదు 105,000 కంటే ఎక్కువ సార్లు ఈ వీడియోను రీట్వీట్(Re Tweet) చేశారు నెటిజన్లు. నా జీవితంలో ఇంత అద్భుత దృశ్యాన్ని ఇప్పటివరకు చూడలేదు అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి