White king Cobra: నాగుపాము, శ్వేతనాగు, కింగ్ కోబ్రా, అనకొండ లాంటి పాములను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కొందరు ప్రత్యక్షంగా చూడకున్నా కనీసం సినిమాల్లో అయినా చూసుంటారు. ఈ భూమ్మీద 'వైట్ కింగ్ కోబ్రా' కూడా ఉంటుందని చాలా మందికి తెలుసు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఈ పామును చూసుంటారు. చూడని వారి కోసమే ఈ వీడియో. తాజాగా వైట్ కింగ్ కోబ్రా (అల్బినో కోబ్రా)కు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ ముగ్గురు స్నేక్ క్యాచర్‌లు అరుదైన అల్బినో కోబ్రా (Albino Cobra Viral Video)ను పట్టుకునేందుకు తోటలో వెతుకుతుంటారు. ఎందుకంటే అల్బినో కోబ్రాకు మంచి డిమాండ్ ఉంది. ఇది ఉంటే మిలియన్ డాలర్లు సొంతం అవుతాయి. అల్బినో కోబ్రాను వెతుకుంటుండగా ఒకతను పాము ఉండే స్థలాన్ని కనుగొంటాడు. మిగతా ఇద్దరు కూడా పుట్ట వద్దకు వెళ్లి చూసి.. పాము లోపల ఉందని నిర్ధారించుకుంటారు. ముగ్గురు కలిసి గడ్డపారల సాయంతో పుట్టను తవ్వుతారు. 


పుట్టను పూర్తిగా తొలగించిన తర్వాత ముగ్గురు స్నేక్ క్యాచర్‌లకు ఓ రంద్రం కనిస్తుంది. దాన్ని కాస్త తవ్వగా అరుదైన అల్బినో కోబ్రా వారికి కనిపిస్తుంది. స్టిక్ సాయంతో పామును బయటికి తీస్తారు. బయటికి వచ్చిన పాము వారిని చూసి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంది. ఒకతను అల్బినో కోబ్రా తోకను పట్టుకుని దాన్ని అదుపుచేస్తాడు. నెట్టిగా దాని తలని స్టిక్ సాయంతో నెలకు అదిమిపట్టి దాన్ని పెట్టేస్తాడు. ఆపై సంచిలో బంధిస్తాడు. 



ప్రస్తుతం అల్బినో కోబ్రాకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోను 'Cobra carving' అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి 116,611 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి నెట్టింట కామెంట్ల వర్షం కురుస్తోంది.


Also Read: King Cobra Viral Video: బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాను ఇంత ఈజీగా పట్టొచ్చా.. వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్ అవుతాయి!


Also Read: Car Discount Offer 2023: మార్చి బొనాంజా.. ఈ 5 కార్లపై 3 లక్షల వరకు తగ్గింపు! బెస్ట్ ఎస్‌యూవీ కొనడానికి ఉత్తమ సమయం ఇదే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి