Allu Arjun Wishes His Father Allu Aravind On His Birthday: టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్స్‌లో ఒకరైన అల్లు అరవింద్ పుట్టినరోజు నేడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించిన అల్లు అరవింద్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఇతర రంగాల వారు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్‌లో అల్లు అరవింద్ బర్త్‌డే విషెస్‌తో హోరెత్తుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన తండ్రి అల్లు అరవింద్‌()కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి నాన్నా. నీకు తెలిసిన వాళ్లకు, కావాల్సిన వాళ్లకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు. మా జీవితంలో నువ్వు ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ పుట్టినరోజుతో మీరు మరింత యంగ్‌గా అవ్వాలంటూ’ హీరో అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.


Also Read: HBD Allu Aravind: నిర్మాత అల్లు అరవింద్ గురించి 10 ఈ ఆసక్తికర విషయాలు


 



 


1949 జనవరి 10న అల్లు రామలింగయ్య, కనకరత్నం దంపతులకు అల్లు అరవింద్(Allu Aravind) జన్మించారు. దర్శకరత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘బంట్రోతు భార్య’ సినిమాతో నిర్మాతగా కెరీర్ ప్రారంభించారు. అల్లు అరవింద్‌‌కు ముగ్గురు కుమారులు. కాగా,  అల్లు వెంకటేష్ (బాబీ), అల్లు అర్జున్, అల్లు శిరీష్. రెండో కుమారుడు, మూడో కుమారుడు సినిమాలు చేస్తున్నారు.


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook