Driverless Bike Video: డ్రైవర్‌లెస్ కారు చూశారు.. మరి డ్రైవర్‌లెస్ బైక్ చూశారా?
Driverless Bike Video: డ్రైవర్‌లెస్ కారును వినియోగదారులకు అందించాలనే సంకల్పంతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవలే ఓ కారును ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే అంతలోనే డ్రైవర్‌లెస్ బైక్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. డ్రైవర్ లేకుండా బైక్ ఎలా నడుస్తుంది అనుకుంటున్నారా? అయితే అదేంటో మీరూ చూసేయండి!
Driverless Bike Video: సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్ ఉండే పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా(Anand Mahindra News).. తరచుగా నెటిజన్లతో పలు విశేషాలను షేర్ చేస్తుంటారు. తాజాగా డ్రైవర్‌లెస్ మోటార్‌సైకిల్(Driverless Bike) అంటూ ఓ వీడియోను ట్విట్టర్లో(Anand Mahindra Twitter) షేర్ చేశారు ఆనంద్ మహీంద్రా. అందులో పల్సర్ బైక్‌పై ఓ వ్యక్తి వెనుక సీట్లో కూర్చొని ప్రయాణం చేస్తున్నాడు. ఇందులో విచిత్రం ఏంటంటే.. ఆ బైక్‌కు డ్రైవర్ అంటూ ఎవరూ లేరు. ఆ బైక్ దానంతట అదే ముందుకు సాగుతూ ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సహా ఆనంద్ మహీంద్రా కూడా ఆశ్చర్యపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా.. తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు కిషోర్ కుమార్ హీరోగా 1972లో విడుదలైన 'పరిచై' సినిమాలోని ఓ పాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 'డ్రైవర్ లేకుండా సాగే ప్రయాణం నాది.. దానికి గమ్యం అంటూ లేదు' అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్(Anand Mahindra Twitter) చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 5.95 లక్షల మంది వీక్షించారు.
ఈ డ్రైవర్‌లెస్ బైక్ వీడియో (Driverless Bike Video) చూసిన కొందరు నెటిజన్లు.. "డ్రైవర్‌లెస్ కారును రూపొందించిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon Musk News) కూడా ఈ బైక్‌ను చూస్తే షాక్ అవ్వాల్సిందే" అని కామెంట్లు చేస్తున్నారు. ఇండియాలో డ్రైవర్‌లెస్ బైక్ వచ్చిందని కామెంట్ చేస్తుండగా.. మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేయడం బాగోలేదని అభిప్రాయపడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.