Women Cheats to Hotel Staff: ధనవంతురాలిగా నటించి స్టార్‌ హోటల్‌లో 15 రోజుల పాటు ఓ మహిళ బస చేసింది. హోటల్‌లో ఉన్న రోజుల్లో విందువినోదాలతో ఎంజాయ్‌ చేసింది. చివరికి బిల్లు కట్టే సమయంలో మోసానికి పాల్పడింది. ఫేక్‌ యూపీఐ ద్వారా డబ్బు చెల్లించినట్లు నమ్మించి సిబ్బందిని మోసం చేయడానికి ప్రయత్నించింది. అయితే తమకు డబ్బు జమ కాలేదని సిబ్బంది చెప్పారు. ఆమె మోసానికి పాల్పడుతుందని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమెను అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన మహిళ ఝాన్సీరాణి శామ్యూల్‌ గతేడాది డిసెంబర్‌ 13వ తేదీన ఢిల్లీలోని పుల్‌మేన్‌ హోటల్‌లో 15 రోజులకు గది బుక్‌ చేసుకుంది. 15 రోజులు హోటల్‌లో ఉంటూ విలాస జీవితం గడిపింది. స్పా, రెస్టారెంట్‌, విందులు అన్నింటిని ఝాన్సీరాణి వినియోగించింది. స్పా కోసం రూ.2.11 లక్షలు ఖర్చు చేసింది. తీరా ఖాళీ చేసే సమయానికి రూ.6 లక్షల బిల్లు అయ్యింది. బిల్లు చెల్లించేందుకు వచ్చిన ఆమె ఐసీఐసీఐ బ్యాంక్‌ యూపీఐ యాప్‌ ద్వారా చెల్లించినట్లు సిబ్బందికి ఫోన్‌లో చూపించింది. ఆమె చెల్లించినట్టుగా చెబుతున్న నగదు తమ ఖాతాలో జమ కావడంతో హోటల్‌ సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. తీరా ఆరా తీయగా ఆమె చూపించిన పేమెంట్‌ ఫొటో నకిలీదని తేలింది. 


వెంటనే హోటల్‌ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి విచారించారు. ఆమె వినియోగించిన బ్యాంక్‌ ఖాతా కూడా నకిలీది. ఆమె బ్యాంకులో వివరాలు పరిశీలించగా కేవలం రూ.41 మాత్రమే ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగానే ఆమె ఇలా చేసిందని పోలీసులు గుర్తించారు. డబ్బులు లేకపోయిన మోసం చేయడానికి ప్రయత్నించిన ఆమెపై కేసు నమోదు చేశారు. అనంతరం స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Love Proposal: ఇది 'ప్రేమ దోపిడీ'.. ఇతగాడి 'లవ్‌ ప్రపోజ్'‌ చూస్తే మీరు ప్రేమలో పడతారు

Also Read: Kumari Aunty: స్ట్రీట్‌ ఫుడ్‌ కుమారి ఆంటీపై పోలీస్ కేసు.. ఆందోళనలో ఆమె అభిమానులు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook