Android 11 features: న్యూయార్క్‌: ఆండ్రాయిడ్‌ యూజర్స్‌కు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న ఆండ్రాయిడ్ 10 ( Android 10 OS) ఆపరేటింగ్ సిస్టంను అప్‌డేట్ చేస్తూ కొత్తగా రానున్న ఆండ్రాయిడ్ 11 ( Android 11 ) విడుదల తేదీతో పాటు ఆండ్రాయిడ్ 11 ఫీచర్స్‌ని తాజాగా గూగుల్ వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న ఆండ్రాయిడ్ 11ను విడుదల చేయనున్నట్టు గూగుల్‌ స్మార్ట్‌హోమ్‌ డివిజన్‌ సీనియర్‌ డైరెక్టర్‌ మిచెల్‌ టర్నర్‌ తెలిపారు. అమెరికాలో జరిగిన 'హే గూగుల్' స్మార్ట్ హోమ్ సమ్మిట్‌ వేదికపై ( Hey Google Smart Home Summit ) మిచెల్ టర్నర్ ఈ వివరాలు వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : Instagram Reels: టిక్‌టాక్ స్థానంలో రీల్స్ యాప్.. ఇండియాలో ట్రయల్ షురూ!


ఆండ్రాయిడ్ 11 ఫీచర్స్‌లో పీపుల్, కంట్రోల్స్, ప్రైవసీ, ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌కు నోటిఫికేషన్స్, స్క్రీన్ రికార్డింగ్, వీడియోలను రికార్డ్ చేసేటప్పుడు నోటిఫికేషన్ సౌండ్‌ని మ్యూట్ చేయడం వంటి అంశాలపై ( Android 11 updates ) దృష్టి సారించినట్టు గూగుల్ ప్రకటించింది. అన్నింటికి మించి సైబర్ సెక్యురిటీకి ( Cyber security ) అధిక ప్రాధాన్యతనిస్తూ సెక్యూరిటీకి సంబంధించిన అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు గూగుల్ స్పష్టంచేసింది. ఆండ్రాయిడ్ 11 అందుబాటులోకి వస్తే.. స్మార్ట్ ఫోన్ యూజర్స్ ఎక్స్‌పీరియన్స్ మరింత ఆహ్లాదకరంగా ఉండనున్నట్టు ఆండ్రాయిడ్‌ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ డేవ్ బర్క్ తెలిపారు. ( Also read : Apps banned in China: గూగుల్, ఫేస్‌బుక్, ట్విటర్, యూట్యూబ్, వాట్సాప్ సహా చైనాలో ఇవన్నీ నిషేధమే )


ఇప్పటికే ఈ ఆండ్రాయిడ్ 11 వెర్షన్‌కి సంబంధించి గత నెలలో బీటా 1 విడుదల చేయగా తాజాగా ఆండ్రాయిడ్ బీటా 2 కూడా వచ్చేసింది. ఆండ్రాయిడ్ 11 టెస్టింగ్‌లో ( Android 11 testing ) భాగంగానే ఈ బీటా వెర్షన్స్ విడుదలయ్యాయి. దీంతో ఆండ్రాయిడ్ 11 ప్లాట్‌ఫామ్ స్టెబిలిటీ మైల్‌స్టోన్‌కు చేరుకున్నట్టేనని గూగుల్ పేర్కొంది. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..